టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా మెంటర్‌గా వ్యవహారిస్తున్న ధోని క్షణం తీరికలేకుండా తన పనిలో మునిగిపోయాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పట్టుబట్టి మరీ ధోనిని టీమిండియా మెంటర్‌గా తీసుకొచ్చినందుకు, తనపై పెట్టుకున్న నమ్మకానికి వందశాతం న్యాయం చేస్తూ ఆటగాళ్లను పదునుపెడుతున్నాడు ధోని. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా వామప్ మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్‌కు కీపింగ్‌లో మెళకువలు నేర్పిస్తూ కనిపించాడు. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన పంత్ ఈ వరల్డ్ కప్‌లో మన జట్టులో కీలకం కానున్నాడు. అందుకే మెంటర్ ధోని అతనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.
వికెట్ కీపర్‌గా ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను చేసిన స్టప్పింగ్‌లు, రన్‌అవుట్లే ధోని గురించి చెప్తాయి. అలాగే పంత్ కూడా ధోని వారసుడిగా కీపింగ్‌లో మంచి ప్రతిభనే కనబరుస్తున్నాడు. అతన్ని మరింత తీర్చిదిద్దేందుకు ధోని అతని చేత గంటల కొద్ది ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ధోని ట్రైనింగ్ ఇస్తే ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పేందుకు పంత్‌ను చూస్తే అర్థం అవుతోంది. చెమటలు కక్కుతూ శ్రద్ధగా ధోని సూచనలను వింటూ రాటుదేలుతున్నాడు పంత్. మరి టీమిండియా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంతలా కష్టపడుతున్న ధోనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంతో తెలియజేయండి.
Mentor MS Dhoni & Rishabh Pant #T20WorldCup #MSDhoni #INDvAUS pic.twitter.com/zlifcdDP4j
— Shoronjeet Banerjee (@shoronjeet02) October 20, 2021