టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించాడు. తన కెరీర్ ఆరంభంలో కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా వరుసగా రెండు బీమర్లు వేసినందుకు.. తనపై సోషల్ మీడియాలో కొంతమంది తీవ్ర విమర్శలు గుప్పించారని గుర్తుచేసుకున్నాడు. తండ్రిలా వెళ్లి ఆటో నడుపుకోమంటూ ఘోరంగా అవమానించారని అన్నాడు. ఆ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాటలు తనకు ఎంతో ఊరటనిచ్చాయని పేర్కొన్నాడు.
మనం అద్భుతంగా రాణించినప్పుడు మనల్ని ప్రశంసించిన వారే.. మనం ఫెయిల్ అయిన నాడు విమర్శిస్తారని.. అందుకే వారిని పట్టించుకోవద్దని ధోని తనతో చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి తనపై వచ్చే విమర్శల గురించి ఆలోచించడం మానేసినట్లు సిరాజ్ వెల్లడించాడు. కాగా సిరాజ్‌ను ఆర్సీబీ జట్టు రూ.7 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సిరాజ్ అద్భుతమైన ఇన్ స్వింగర్‌తో విండీస్ ఓపెనర్ హోప్‌ను బౌల్డ్ చేశాడు. మరి ఒక గల్లీ క్రికెటర్ స్థాయి నుంచి టీమిండియా స్టార్ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన సిరాజ్ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.