Mohammed Shami: టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వైవాహిక జీవితం గురుంచి అందరకి తెలిసిందే. ఎప్పుడూ కూడా సాఫీగా సాగలేదు. భార్య హసీన్ జహాన్‌తో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ కారణంగానే 2018 నుంచి వేరుగా ఉంటున్నారు. ఇంత దుఃఖాన్ని కూడా దిగమింగుకొని షమీ రాణించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయినప్పటికీ అతన్ని దురదృష్టం వదల్లేదు. ఏదో ఒక కారణంగా క్రికెట్ కు దూరమవుతూనే ఉన్నాడు. ఈ తరుణంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో అయినా బరిలోకి దిగుతాడనుకుంటే.. ఇప్పుడు ఏకంగా సిరీస్ కే దూరమయ్యాడు.
ప్రస్తుత టీమిండియా బౌలర్లలో బుమ్రా తరువాత చెప్పుకోదగ్గ బౌలర్ ఎవరంటే.. మహమ్మద్ షమీనే. అలాంటి ఆటగాడిని వన్డేలు, టెస్టులకు పరిమితం చేసిన బీసీసీఐ, టీ20 ఫార్మాట్‌కు దూరంగా పెడుతోంది. ఈ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసింది. ఒక నాణ్యమైన బౌలర్ ను.. స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపికచేయడం విమర్శలకు దారి తీసింది. ఎంతవరకు సమంజసమని అభిమానులు మండిపడ్డారు. దీని నుంచి తప్పించుకోవడానికి బీసీసీఐ.. స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపిక చేసింది. ఇక్కడా దురదృష్టమే వెంటాడింది షమీని. ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో షమీకి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఫలితంగా సిరీస్ కే దూరమయ్యాడు.
Mohammed Shami tests positive for Covid-19, likely to miss Australia T20Is
Details: https://t.co/JnAFT0lXOF | #INDvsAUS pic.twitter.com/M1KzWHSOfP
— Sportstar (@sportstarweb) September 17, 2022
కరోనా కారణంగా మహమ్మద్ షమీ దూరమవడంతో అతని స్థానంలో ఉమేశ్ యాదవ్‌కి చోటు కల్పించింది.. మేనేజ్‌మెంట్. ప్రస్తుతం ఉమేశ్ యాదవ్.. మిడిల్‌సెక్స్ తరుపున రాయల్ లండన్ వన్డే క్రికెట్ టోర్నీలో ఆడుతున్నాడు. 7 మ్యాచుల్లో 16 వికెట్లతో.. మిడిల్‌సెక్స్ క్లబ్ తరుపున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఈ పర్ఫామెన్స్ కారణంగా ఉమేశ్ యాదవ్‌ని ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు. షమీ క్రికెట్ ప్రయాణంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Indian speedster Mohammed Shami has been ruled out of Australia T20Is after testing positive for COVID-19.
As per reports, Umesh Yadav has been named a replacement for Shami.#INDvsAUS #MohammadShami #UmeshYadav pic.twitter.com/mil9LBPzui
— OneCricket (@OneCricketApp) September 18, 2022