‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్’ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయంతో దాదాపు సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. మరోవైపు ఆఫ్గన్ జట్టు కూడా అత్యుత్తమ ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల మనసులు దోచుకుంది. ముఖ్యంగా మహ్మద్ నబీ కెప్టెన్ ఇంన్నింగ్స్ ఆడటం.. పెద్ద పెద్ద టీమ్‌లు పాక్‌ను కట్టడి చేయడంలో విఫలమైతే ఒకానొక సమయంలో పాక్‌కు ఓటమి భయాన్ని చూపించింది ఆఫ్గనిస్థాన్ టీమ్. పసికూన ముద్రను ఎప్పుడో తుడిచిపారేసింది. అంతేకాకుండా బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తోంది. ఇప్పుడు ప్రదర్శన గురించి కాకుండా ఆఫ్గన్ టీమ్ కెప్టెన్ మహ్మద్ నబీ పేరు మరో విషయంలో వార్తల్లో నిలిచింది.
ఆఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్నాక అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో అందరికీ తెలుసు. తింటానికి, ఉండటానికే అక్కడ పర్మిషన్ దొరకడం కష్టం అలాంటిది క్రికెట్ అంటే వాళ్లు ఎందుకు ఒప్పుకుంటారు అని అందరూ ముందే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వాళ్లు క్రికెట్‌కు ఓకే చెప్పి షాక్‌కు గురిచేశారు. కానీ, అక్కడే వాళ్ల కపడ బుద్ధి బయట పెట్టారు. వరల్డ్ కప్ ఆడేందుకు సరే అని ఒక్క రూపాయి కూడా ఇవ్వమన్నారు. కెప్టెన్‌గా ఉండటమే కాకుండా నబీ టీమ్ స్పాన్సర్‌గా అవతారమెత్తాడు. మహ్మద్ నబీ సొంత ఖర్చుతో ఆఫ్గన్ టీమ్‌ను యూఏఈ ఫ్లైట్ ఎక్కించాడు నబీ. ఇప్పుడు అందరూ అప్పట్లో నబీకి ప్రెసిడెంట్ అని ఊరికే పేరు పెట్టలేదు.. అంటూ ప్రెసిడెంట్ నబీ అంటూ ప్రశంసిస్తున్నారు. భారత్- న్యూజిలాండ్ మ్యాచ్‌లో విజయం ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.