క్రికెట్ అంటే భారతీయులకు ఎనలేని ప్రేమ.. మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ.. అది రెండో స్థానానికి పరిమితం. అంతలా క్రికెట్ ను ఆదరిస్తారు. క్రికెట్ ప్రయాణంలో ఎన్నో టోర్నీలు.. లెక్కలేనన్ని మ్యాచులు. ఇక పంచకప్ అంటే అందరి కల.. ఎన్ని మ్యాచులు గెలిచినా.. ఒక్కసారి ప్రపంచ కప్ టైటిల్ సొంతమైతే ఆ కిక్కేవేరు. ప్రతి దేశం ఈ టోర్నమెంట్ అద్భుతంగా రాణించాలనే చూస్తుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశ మహిళల క్రికెట్ ప్రస్థానంలో ఇది ఒక అందరి ద్రాక్షగా మిగిలిపోయింది. ఇంగ్లాండ్ వేదికగా 1973 నుంచి ప్రారంభమైన ఈ టోర్నీలో మొదటిసారి ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పటివరకు మహిళలు వన్డే ప్రపంచకప్ 11 సార్లు జరగ్గా.. 6 సార్లు ఆస్ట్రేలియా, 4 సార్లు ఇంగ్లాండ్, 1 సారి న్యూజిలాండ్ విజేతగా అవతరించాయి. చివసారిగా 2017 లో జరిగిన ఈ టోర్నీలో భారత మహిళల జట్టు రన్నరప్ గా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా మిగిలిపోతున్న వరల్డ్ కప్ టైటిల్ ని ఈ సారి సొంతం చేసుకోవాలని చూస్తోంది.
ఐసీసీ మహిళ వన్డే ప్రపంచకప్-2022 సమరానికి రంగం సిద్దమైంది. న్యూజిలాండ్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది. మౌంట్ మౌంగానుయ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో అతిథ్య న్యూజిలాండ్ మహిళల జట్టు.. వెస్టిండీస్ మహిళల జట్టుతో తలపడనుంది. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. కాగా మెగా టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తన మనసులోని మాటను బయట పెట్టింది.“2000లో కూడా న్యూజిలాండ్‌లోనే జరిగిన ప్రపంచకప్‌లో ఆడాను. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడకు వచ్చాను. “నా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రపంచకప్ టైటిల్‌తో ముగించాలని కోరుకుంటున్నా. మా జట్టు సభ్యులంతా బాగా రాణించి మా ప్రణాళికలన్నీ సఫలం చేయాలని ఆశిస్తున్నా.ప్రపంచకప్ గెలిస్తే మా ఆటగాళ్లందరికీ స్వదేశంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మమ్మల్ని చూసి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాం” అని మిథాలీ విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఇక మిథాలీ రాజ్‌కు ఇది 6వ వన్డే వరల్డ్ కప్. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా ఆమె నిలవనుంది.
Captain Mithali Raj discusses India’s preparation, goals for #CWC22 and the desire to win their first ever ICC Women’s Cricket World Cup 🏆
— ICC (@ICC) March 1, 2022
భారత మహిళల జట్టు ఈ ఏడాది ఎన్నో ఆశలతో న్యూజిలాండ్ లో అడుగు పెట్టింది. ఎనిమిది జట్ల టోర్నీలో భారత జట్టు టైటిల్ ఫేవరెట్ కాకపోవచ్చేమో.. కానీ, మన జట్టు ప్రత్యర్థులకు గట్టి పోటీ అనడంలో సందేహం లేదు. గత ప్రపంచకప్ (2017) ఫైనల్లో రన్నరప్ గా నిలిచిన భారత్.. ఈసారి మరింత పట్టుదలతో ఉంది. ఈ నెల 6న మౌంట్ మాంగనూయ్ వేదికగా పాకిస్థాన్ తో భారత జట్టు తలపడనుంది. చూడడానికి భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ రూపంలో స్టార్ ఓపెనర్లు భారత్ సొంతం. మంధాన గురుంచి ప్రస్తావిస్తే.. దూకుడుగా ఆడగలదు, అవసరమైతే సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఎక్కువ సేపు క్రీజులో నిలిచి పెద్ద ఇన్నింగ్స్ ఆడగలదు. ఇక షెఫాలీ ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపు ఆరంభాన్నీ ఇవ్వగలదు. ఆమె సామర్థ్యం మేరకు రాణిస్తే భారత్ కు తిరుగుండదనడంలో సందేహం లేదు.ఇక భారత మహిళల క్రికెట్ లో సుదీర్ఘ కాలంగా రాణిస్తూ.. అనుభవజ్ఞురాలైన కెప్టెన్ మిథాలీ రాజ్ జట్టుకు వెన్నెముక. ఇటీవల న్యూజిలాండ్ తో సిరీస్ లో మూడు అర్ధ సెంచరీలు సాధించిన మిథాలీ.. మునుపటి కంటే వేగంగా పరుగులు రాబట్టింది. మిడిల్ ఆర్డర్ లో హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి బ్యాటర్ ఉండడం భారత్ కు కలిసొచ్చేదే.. అయితే హర్మన్ ప్రీత్ ఫామ్ అందుకోవడం చాలా ముఖ్యం. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచులో సెంచరీతో రాణించింది హర్మన్ ప్రీత్. ఆఫ్ స్పిన్నర్ గా దీప్తి శర్మ, వికెట్ కీపర్ రీచా ఘోష్ కూడా మంచి బ్యాటింగ్ నైపుణ్యమున్న బ్యాటర్లే. ఈ బ్యాటింగ్ దళం సమష్టిగా రాణిస్తే ప్రపంచకప్ లో ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు.
1⃣ squad, 1⃣ mission & a billion dreams – united by #HamaraBlueBandhan, a special bond between #WomenInBlue & the fans!
Are you ready to join us & cheer for #TeamIndia in the ICC Women’s World Cup 2022?
ICC #CWC22 | #PAKvIND | Mar 6, 6:30 AM | Star Sports 2/2HD/3/Disney+Hotstar pic.twitter.com/3y9oqocMTy
— Star Sports (@StarSportsIndia) March 1, 2022