మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచ కప్ సంగ్రామం మొదలుకానుంది. ఇప్పటికే కొన్ని జట్లు ఆస్ట్రేలియాలో మకాం వేశాయి. టీమిండియా కూడా పెర్త్ చేరుకుని లోకల్ టీమ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. అలాగే దాదాపు అన్ని జట్లు తమ టీ20 వరల్డ్ కప్ స్కౌడ్ను ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సైతం తమ దేశంలోనే జరిగే వరల్డ్ కప్ కోసం జట్టును చాలా రోజుల క్రితమే ప్రకటించింది. కాగా.. ఈ జట్టు ఎంపికపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ 2015లో ఆసీస్‌కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాత్రమ పెదవి విరిచాడు. ఇదేం చెత్త టీమ్ సెలెక్షన్ అంటూ విమర్శలు గుప్పించాడు. జట్టులో చేయాల్సిన మార్పుల గురించి కూడా ప్రస్తావించాడు.
స్టార్ ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్‌ను టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోవడంపై క్లార్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓపెనర్‌గా, పేస్ బౌలర్‌గా జట్టుకు ఎంతో బలాన్ని ఇచ్చే గ్రీన్‌ను వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకోకపోవడం ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ అని పేర్కొన్నాడు. టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య భారత్‌లో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లోనూ గ్రీన్ అద్భుతంగా రాణించాడు. పవర్ ప్లేలో భారీగా పరుగులు చేసి.. టీమిండియా బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. పైగా డేవిడ్ వార్నర్‌తో కలిసి గ్రీన్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే.. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా కుదురుతుంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఓపెనర్‌గా విఫలం అవుతున్న నేపథ్యంలో అతను వెస్టిండీస్‌లో సిరీస్‌లో మిడిల్డార్‌లో ఆడి పరుగులు రాబట్టాడు. దీంతో గ్రీన్ జట్టులోకి తీసుకోవాల్సిందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.
ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఓపెనర్‌గా ఆడించాలని క్లార్క్ సూచించాడు. అతన్ని మూడు, నాలుగో స్థానంలో ఆడించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని.. స్మిత్‌ను ఓపెనర్‌గా ఆడిస్తే.. వరల్డ్ కప్ టోర్నీలో అతనే టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని క్లార్క్ ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో స్మిత్‌కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వాలని.. అతనికి వీలైనంత టైమ్ క్రీజ్‌లో గడిపే అవకాశం కల్పించి.. మంచి రిథమ్ అందుకునేలా చేయాలని అన్నాడు. కామెరున్ గ్రీన్‌ను టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోవడం ‘మిస్టేక్’ అంటూ క్లార్క్ అభివర్ణించాడు. కాగా. క్లార్క్‌తో పాటు గ్రీన్‌ను వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోవడంపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు.
‘A mistake’: Clarke blows up at star’s omission and says selection ‘strange’ ahead of T20 World Cup | @ChristypDoran https://t.co/RmbkhbfXG7
— Fox Cricket (@FoxCricket) October 11, 2022