టీమిండియా వెటరన్ క్రికెటర్ మనీష్ పాండే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 2015లోనే టీమిండియాలోకి వచ్చిన పాండే.. నిలకడలేమితో జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. ప్రతి ఏడాది ఐపీఎల్ ఆడుతున్నా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. మళ్లీ ఎలాగైన టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని పట్టుదలతో దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూ.. సత్తా చాటుతున్నాడు. తాజాగా.. రంజీ సీజన్ 2022-23లో కర్ణాటక తరఫున ఆడుతున్న మనీష్.. గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అది కూడా 111 స్ట్రైక్‌రేట్‌తో ఈ డబుల్ సెంచరీ సాధించడం విశేషం.
గోవాతో మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో కర్ణాటక తొలుత బ్యాటింగ్ చేసి.. 7 వికెట్లు కోల్పోయి 603 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 284 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండే.. ఆ స్కోర్‌ను భారీ స్కోర్‌గా మార్చేశాడు. కేవలం 186 బంతుల్లో 14 ఫోర్లు, 11 సిక్సులతో 208 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మనీష్ పాండేతో పాటు కర్ణాటక ఓపెనర్ రవికుమార్ 140, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 50, విశాల్ 91 పరుగులతో రాణించడంతో కర్ణాటక 603 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గోవా తరఫున బరిలోకి దిగాడు. బౌలింగ్‌లో 2 వికెట్లు సైతం పడగొట్టాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున ఆడుతూ.. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచిన మనీష్ పాండే. యువ క్రికెటర్‌గా ఆడిన ఆ ఇన్నింగ్స్‌తో వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో బెంగుళూరు, పుణే వారియర్స్ ఇండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. తాజాగా ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాండేను 2.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో రాణించడంతో 2015లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన పాండే.. భారత్ తరఫున ఇప్పటి వరకు 29 వన్డేలు ఆడి 566 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 39 టీ20ల్లో 709 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి ఇప్పుడు రంజీలో మనీష్ పాండే డబుల్ సెంచరీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Manish Pandey slams his double century off 183 balls against Goa and seems like he’s not done yet. Karnataka crosses 600. Pandey on 208* with 14 4s and 11 sixes. #RanjiTrophy
(Pic from Duleep Trophy in Sept.) pic.twitter.com/Jb4m230LIB
— Lalith Kalidas (@lal__kal) December 28, 2022