టెస్టు క్రికెట్‌కే వన్నెతెచ్చిన ఆటగాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్‌గా టీమిండియాను అద్భుతంగా నడిపించిన నాయకుడు. పగ్గాలు చేపట్టిన నాడు టెస్టుల్లో అధమస్థానంలో ఉన్న జట్టును అగ్రస్థానంలో నిలిపిన ఉత్తమ సారథి. ఇలా టెస్టు క్రికెట్‌కే బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీని ప్రపంచ కీర్తిస్తున్న వేళ అనుహ్యంగా టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా తప్పుకున్నాడు. దీంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది.
ఇప్పటికే టీ20 కెప్టెన్సీ వదులుకోవడం, వన్డే కెప్టెన్సీ పోయిన దశలో.. ఇక టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పడం చర్చకు దారి తీసింది. కోహ్లీ ఇంత ఉన్నపళంగా కెప్టెన్సీ వదులుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉన్నట్లు సమాచారం. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో వచ్చిన అభిప్రాయభేదాలతోనే కోహ్లీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు గెలిచి, రెండో టెస్టు ఓడి.. 1-1 ఉన్న దశలో మూడో టెస్టుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. కీలకమైన మూడో టెస్టు కోసం జట్టులో మార్పులు చేయాలని విరాట్ కోహ్లీ భావించాడు.
వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న అంజిక్యా రహానే స్థానంలో శ్రేయస్ అయ్యారును తుది జట్టులోకి తీసుకోవాలని.. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తన ప్రతిపాదన జట్టు ముందు ఉంచాడు. కోహ్లీ నిర్ణయంతో ఏకీభవిచంని హెడ్ కోచ్ ద్రవిడ్ రహానే కొనసాగింపుకే మొగ్గు చూపాడు. ఈ విషయంలో కోహ్లీ , ద్రవిడ్ మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మొత్తానికి హెడ్ కోచ్ అనుకున్నట్లు గానే రహానే తుది జట్టులో ఉన్నాడు. గతంలో కెప్టెన్‌గా తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి ఎన్నో విజయాలు సాధించిన కోహ్లీకి ఇప్పుడున్న పరిస్థితి అంతగా రుచించలేదు. ఇలా పూర్తిస్థాయి స్వేచ్ఛ లేకుండా జట్టును ముందుకు నడిపించడం కష్టమని భావించిన కోహ్లీ.. కెప్టెన్సీ వదులుకునేందుకు సిద్ధపడినట్లు సమాచారం.
Was really hoping for to see more of #Dravid and #Kohli duo. Sad day for Indian cricket fans. https://t.co/v0y3XHB8og
— Londonfoodster (@londonfoodster) January 15, 2022
మూడో టెస్టు ప్రారంభానికి ముందు వరకు కెప్టెన్సీ వదులకునే ఆలోచన కోహ్లీకి లేనట్లు సమాచారం. జట్టులో ఎంపికలో వస్తున్న ప్రెషర్‌ను భరించడం ఇష్టం లేకే కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్నాడనే వాదన కూడా వినిపిస్తుంది. ద్రవిడ్, కోహ్లీ మధ్య మంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పటికీ జట్టు తుది ఎంపికలో ఇద్దరి పంథా వేరు కావడంతో కోహ్లీ వెనక్కు తగ్గినట్లు తెలుస్తుంది. మరి కోహ్లీ టెస్టు కెప్టెన్సీ వదులుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ద్రావిడ్ చెప్పినట్లు వింటున్న విరాట్ కోహ్లీ! అందుకే..