ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ.. మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్ ఒకరికొకరు ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయానా లలిత్ మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సుష్మితను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ వీరిద్దరూ కలిసి ఉన్న పలు ఫొటోలను షేర్ చేశాడు.
సుష్మితతో సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్ చేసిన ఆయన..’మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా. నా బెటర్ హాఫ్ (సుష్మిత)తో కొత్త జీవితం ప్రారంభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. చంద్రునిపై తేలియాడుతున్నట్లు ఉంది’ అంటూ కవిత్వాన్ని రాసుకొచ్చారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
Just back in london after a whirling global tour #maldives # sardinia with the families – not to mention my #betterhalf @sushmitasen47 – a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓 pic.twitter.com/Vvks5afTfz
— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022
వీరిద్దరి ఫోటోలు చూసిన నెటిజన్లు.. పెళ్లి చేసుకున్నారేమో అనుకోని శుభాకాంక్షలు తెలియజేశారు. వెంటనే తేరుకున్న లలిత్ మోదీ.. ‘ మీకో నమస్కారం.. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ ఆలోచన మా మదిలోకి ఇంకా రాలేదు. ప్రస్తుతానికి డేటింగ్‌లోనే ఉన్నాం.. ఒక్కరోజులోనే ఒకరితో ఒకరం ప్రేమలో పడిపోయాం’ అని చెప్పుకొచ్చాడు.
Just for clarity. Not married – just dating each other. That too it will happen one day. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/Rx6ze6lrhE
— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022
కాగా, సుష్మితా సేన్ మొదట్లో పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌తో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. ప్రేమాయణమే కాదు.. సహజీవనమూ చేశారు. అయితే.. ఆ అనుబంధం పెళ్లి దాకా వెళ్లకుండానే ముగిసిపోయింది. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత.. సుష్మితా సేన్ ప్రముఖ మోడల్ రోహ్‌మన్‌తో ప్రేమలో పడింది. కానీ అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wasim Akram marrying with Sushmita Sen? – http://t.co/aI0QdfcoWf pic.twitter.com/zDA2c0URyW
— Gulfam Ali (@toppakistani) April 13, 2013
ఇది కూడా చదవండి: Dutee Chand: ‘కూతురు వరుసయ్యే అమ్మాయిని’ పెళ్లాడతానంటున్న ఒలింపిక్ అథ్లెట్ ద్యుతీ చంద్!
ఇది కూడా చదవండి: Robin Uthappa: రెండోసారి తండ్రైన రాబిన్ ఊతప్ప.. కూతురు ఫోటో షేర్ చేస్తూ ఎమోషనల్!