ఆసియా కప్ 2022లో ఘోర పరాభవం తర్వాత.. టీమిండియాపై ఇంటా.. బయట సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జట్టు కూర్పుపై, ఆటగాళ్ల ఫామ్ పై మాజీలు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా స్వ్కాడ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత సెలక్షన్ కమిటీ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ సారథి, కామెంటేటర్ అయిన క్రిష్ణమాచారి శ్రీకాంత్ సెలక్షన్ కమిటీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదీకాక కేఎల్ రాహుల్ కు కొన్ని సూచనలు కూడా చేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కేఎల్ రాహుల్.. గత కొంత కాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అదీ కాక ఆఫ్గాన్ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ సెంచరీ చేయడంతో విమర్శలు మరింతగా ఎక్కువ అయ్యాయి. అయితే కొన్ని నెలల ముందు గాయం కారణంగా ఆపరేషన్ చేయించుకున్న రాహుల్.. విశ్రాంతి తీసుకుని జింబాబ్వే పర్యటనకు వెళ్లాడు. కానీ రెండు మ్యాచుల్లోనే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అయినా కానీ రాహుల్ దాన్ని ఉపయోగించుకోలేక పోయాడు. తాజాగా జరిగిన ఆసియా కప్ లో కూడా రాహుల్ దారుణంగా విఫలం అయ్యాడు. ఆడిన 5 మ్యాచ్ ల్లో కేవలం 132 రన్స్ మాత్రమే చేసి విమర్శల పాలైయ్యాడు. అదీకాక పవర్ ప్లేలో ఎక్కువ బంతులను ఆడి కూడా పరుగులు చేయలేక పోతున్నాడు అన్న అపవాదు కూడా ముటగట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సెలక్షన్ కమిటీ రాహుల్ ను టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక చేసింది.
అయితే శిఖర్ ధావన్ ను కాదని ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రాహుల్ ను ఎందుకు తీసుకున్నారని, సెలక్షన్ కమిటీ పై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ సెలక్షన్ కమిటీపై అలాగే కేఎల్ రాహుల్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.”రాహుల్ నువ్వు క్రీజ్ లో నిలదొక్కుకుంటే భారీ ఇన్నింగ్స్ లు ఆడగలవు.. నీ సొంత ఆట ఆడు.. కానీ అతిగా ఆలోచించకు. అది అంత మంచిది కాదు. అదీ కాక టీ20 ప్రపంచ కప్ జట్టులో షమీ లేకపోవడం ఏంటని సెలక్షన్ కమిటీని ప్రశ్నించాడు. హర్షల్ పటేల్ స్థానంలో మహమ్మద్ షమీ ఉండాల్సింది. కానీ అసలు అతడు మా దృష్టిలోనే లేడు అని కమిటీ చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు.” అని ఘాటుగా స్పందిచాడు. మరి టీ20 సెలక్షన్ కమిటీపై అలాగే కేఎల్ రాహుల్ పై క్రిష్ణమాచారి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.