గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కాలి గజ్జకు ఆపరేషన్ తర్వాత.. పూర్తి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రాహుల్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.
ఇండియన్ ఉమెన్స్ టీమ్ స్టార్ బౌలర్ జులన్ గోస్వామి కూడా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేశారు. జులన్ గోస్వామి బౌలింగ్‌ను కేఎల్ రాహుల్ ఎదుర్కొన్నాడు. తన అద్భుత బౌలింగ్‌తో టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన సీనియర్ ప్లేయర్ గోస్వామి గాయం కారణంగా జట్టుకు దూరమై ఎన్సీబీలోని రిహ్యాబ్ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్నారు.
కాగా.. గోస్వామి బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ ఉమెన్స్ టీమ్ అత్యుత్తమ బౌలర్‌ను భారత్ మెన్స్ టీమ్ స్టార్ బ్యాటర్ మధ్యపోటీ భలే ఉందంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
K L Rahul is batting and Jhulan Goswami is bowling.
📍NCA, Bangalore@klrahul • @cool_rahulfan pic.twitter.com/xkuvvPZsHP
— Juman Sarma (@Juman_gunda) July 18, 2022