ఇటివల భారత్-వెస్టిండీస్ మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు జరిగాయి. రెండు సిరీస్‌లను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. టీ20 సిరీస్ తర్వాత వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియా యంగ్ స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యకుమార్‌ను మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. సూర్యతో కలిసి తాను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతానని, సూర్యను 2011 నుంచి చూస్తున్నట్లు పేర్కొన్నాడు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని ఎదుగుదల అసాధారణమని అన్నాడు. సూర్యకుమార్ ఎదుగుతున్న తీరు తనకు, టీమిండియా ఎంతో మేలుచేస్తుందన్నాడు. ‘సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ క్లాస్ ప్లేయర్, అతన్ని చూసి చాలా నేర్చుకోవాలి’ అంటూ పొలార్డ్.. ఇండియన్ 360 ప్లేయర్‌ను ప్రశంసించాడు. కాగా టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరి పొలార్డ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.