క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్‘ కి పరిచయం అనవసరం. ఆయన తనయుడు అర్జున్ టెండూల్కర్ గురించి కూడా అందరికి తెలిసిందే. ఈ కుర్రాడు ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ ఆడితే చూడాలని అభిమానులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే.. అది అభిమానులకు అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. ఐపీఎల్-2021 మినీ వేలంలో ముంబై ఇండియన్స్.. అర్జున్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ.., సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితంచేసింది. పోనీ, ఈ సారైనా తీరు మారుతుందా అంటే.. లేదు.. మళ్లీ అదే సీన్ రిపీట్. ఐపీఎల్-2022 మెగా వేలంలో అర్జున్ ని రూ.30 లక్షలకు సొంతం చేసుకున్న ముంబై.. ఒక మ్యాచ్ కూడా ఆడించలేదు. ఇలా అర్జున్ విషయంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీరు అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం ‘కపిల్ దేవ్’.. అర్జున్ పై స్పందించాడు.
అర్జున్ క్రికెట్ ఎంట్రీపై స్పందించిన ‘కపిల్ దేవ్’.. అతడింకా చిన్న కుర్రాడని.. ఒకవేళ క్రికెట్ లో అతడు రాణించాలని అనుకుంటే టెండూల్కర్ చేసిన దానిలో 50 శాతం చేసినా సరిపోతుందని వ్యాఖ్యానించాడు. అన్ కట్ అనే మ్యాగజైన్ తో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. “అందరూ పదే పదే అతడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. అతడు సచిన్ టెండూల్కర్ కొడుకు మాత్రమే. అతనకి స్వేచ్ఛనివ్వాలి. అర్జున్ ను సచిన్ తో పోల్చకండి. అతడి ఆటను అతడు ఆడుకోనివ్వండి. అతడింకా చాలా చిన్న కుర్రాడు. టెండూల్కర్ పేరు అతడి చివర ఉండటం వల్ల అర్జున్ కు ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి”.
Why is everyone talking about him? Because he is Sachin’s son. Let him play his own cricket, To have a Tendulkar name has perks and disadvantages as well. Bradman’s son changed his name because he could not soak the pressure.
– Kapil Dev On Arjun Tendulkar #SachinTendulkar pic.twitter.com/WOkjFrh54P
— Fantasy Sports King (@FantasySportsK1) June 4, 2022
ఇది కూడా చదవండి: Rijwan: ఇండియాతో క్రికెట్ ఆడాలని ఉంది.. పాక్ ప్లేయర్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
“ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్ మెన్ కొడుకు.. తన తండ్రి పెట్టిన పేరును మార్చుకున్నాడు. అభిమానుల అంచనాలను, ఒత్తిడిని తట్టుకోలేక అతడు తన పేరు చివరన సర్ బ్రాడ్ మెన్ ను తొలగించుకున్నాడు. అర్జున్ కూడా ఒత్తిడి చేయకండి. అతడు ఇంకా కుర్రాడు. సచిన్ అతడి తండ్రి అయినప్పుడు అర్జున్ కు ఇంకా ఆట గురించి చెప్పడానికి మనమెవరం..?. నేను అతడికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను.. నీ ఆట నువ్వు ఆడు. ఎవరి దగ్గరా నువ్వు ప్రూవ్ చేసుకోవల్సిన అవసరం లేదు. మీ నాన్న ఆడిన ఆటలో సగం ఆడినా అంతకుమించిన గొప్ప విషయం లేదు. టెండూల్కర్ పేరు వింటే మనకు మన ప్రమేయం లేకుండానే అర్జున్ మీద అంచనాలు పెరుగుతాయి. ఎందుకంటే సచిన్ ఆ బెంచ్ మార్క్ సెట్ చేశాడు” అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
🗣️ Kapil Dev: Arjun Tendulkar doesn’t need to prove anything pic.twitter.com/Yj18HyaofS
— CricFit (@CricFit) June 4, 2022