టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొన్ని వారాలుగా జాతీయ జట్టులో లేడు. గాయం కారణంగా టీమిండియాకు దూరమైన బుమ్రా తిరిగి టీమ్‌లోకి వచ్చేందుకు ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. జట్టులో ప్రధాన పేసర్‌గా ఉన్న బుమ్రా.. ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్ కప్‌కు ముందు గాయంతో టీమ్‌కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీతో జట్టు బౌలింగ్ ఎటాక్‌పై తీవ్ర ప్రభావం పడింది. సెమీస్ వరకు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ అండతో నెట్టుకొచ్చిన టీమిండియా.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. సెమీస్‌లో ఓటమికి బౌలింగ్ వైఫల్యమే ప్రధాన కారణంగా నిలిచింది. కానీ.. బుమ్రా టీమ్‌లో ఉండి ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే.. కీలక టోర్నీకి ముందు తనని తాను ఫిట్‌గా ఉంచుకోనందుకు బుమ్రాపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి.
జట్టులో లేకపోయినా.. మైదానంలో దిగి ఆడకపోయినా.. ఇలా ఏదో ఒక విధంగా బుమ్రా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరీస్‌ను ముగించుకుని.. రెండు టెస్టుల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో కూడా లేని బుమ్రా తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాడు. ‘పాకిస్థాన్‌లో బుమ్రా’ అంటూ ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలు షేర్ చేస్తున్న నెటిజన్లు.. ‘బుమ్రా బాల్యం పాకిస్థాన్‌లో గడిచిందా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అందుకు కారణం పాకిస్థాన్‌లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో తీసిన ఒక ఫొటోలో బుమ్రాలానే ఒక చిన్నారి ఉండటమే.
ఆ ఫొటోలో ఒక చిన్నారి అచ్చం బుమ్రాలానే కనిపిస్తున్నాడు. బుమ్రా ఫేస్ కట్‌తో సేమ్ టూ సేమ్ బుమ్రా ఒక పదేళ్ల కుర్రాడిలా మారితే ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు. దీంతో పాకిస్థాన్‌లో జస్ప్రీత్ బుమ్రా అంటూ పాక్ అభిమానులు సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేస్తున్నారు. ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్ సైతం .. అరె నిజంగానే బుమ్రాలానే ఉన్నాడే ఈ కుర్రాడు. జూనియర్ బుమ్రా అంటూ పేర్కొంటున్నారు. దీంతో ప్రస్తుతం భారత్‌లోనూ ఈ జూనియర్ బుమ్రా ఫొటో వైరల్‌గా మారింది. అయితే.. ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య ముల్తాన్ వేదికగా ఈ నెల 9 నుంచి 12 మధ్య జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ టీమ్‌కు మద్దతు తెలపడానికి వచ్చిన కుర్రాడే ఈ జూనియర్ బుమ్రా. పాకిస్థాన్‌కు చెందిన కుర్రాడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు.
🚨 JASPRIT BUMRAH spotted in Pakistan!#PAKvENG pic.twitter.com/96WqrlnvDN
— Azan Ahmad (@azanahmad257) December 11, 2022