క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ బీసీసీఐ ఆదివారం(మార్చి 6) ఇండియన్ ప్రీమియర లీగ్ (ఐపీఎల్ 2022) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ సారి 10 జట్లతో కూడిన లీగ్‌లో ప్లేఆఫ్ మ్యాచ్‌లతో కలిపి 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 26న టోర్నీ మొదలై.. మే 29న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. మొత్తం 65 రోజులపాటు క్రికెట్ అభిమానులను ఐపీఎల్ మెగా లీగ్ అలరించనుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ).. ఐపీఎల్ లో ఆంత్యత ఫ్యాన్ బేస్ కలిగిన టీముల్లో ఒకటి. ఈ ప్రాంచైజీకి సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా దానిమీద సోషల్ మీడియా వేదికగా చర్చ జరగాల్సిందే అంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ.. తమ కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్‌ను నియమించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ.. కెప్టెన్‌గా కార్తీక్‌నే ఖారారు చేసిందని అభిమానులు పేర్కొంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌గా మెరుగైన విజయాలందించేందుకు కోహ్లీ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
అయితే,.. కోహ్లీ జాతీయ జట్టుకు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగడంతో ఆర్‌సీబీ కెప్టెన్‌గా తనే కొనసాగాలని ఆ టీమ్ మేనేజ్‌మెంట్ కోరింది. కానీ అతను దానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ముందస్తు ప్రణాళికల్లో భాగంలో వేలంలో ఫాఫ్ డుప్లెసిస్, దినేశ్ కార్తీక్ వంటి అనుభవం కలిగిన ఆటగాళ్లను తీసుకున్నప్పటికీ.. ఆర్‌సీబీ.. కోహ్లీని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో షెడ్యూల్ ఖారారైనా.. అన్ని జట్లు తమ కెప్టెన్లను ప్రకటించి ప్రాక్టీస్ క్యాంప్‌లు మొదలు పెట్టినా ఆర్‌సీబీ మేనేజ్మెంట్ మాత్రం తమ సారథి పేరును వెల్లడించకపోవడం గమనార్హం.
మరోసారి ఆర్‌సీబీ పగ్గాలు చేప్పట్టేందుకు విరాట్ కోహ్లీ సుముఖంగా లేకపోవడంతో ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఇతర ఆటగాళ్ల పేర్లను పరిశీలిస్తోంది. ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్‌ల పేర్లను పరిశీలించిన ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్.. దినేశ్ కార్తీకే సరైనవాడని భావించిందట. ఫాఫ్ ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలో అతనికి సారథ్యం ఇస్తే జట్టు ఇబ్బందుల్లో పడుతుందని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ భావించినట్లు తెలుస్తోంది. ఇక గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు కెప్టెన్సీ ఇస్తే అది అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందని, స్వేచ్చగా ఆడలేడనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గతంలో కేకేఆర్ జట్టును నడిపించిన అనుభవం దృష్ట్యా దినేశ్ కార్తీక్ సరైనవాడిగా భావించినట్లు వార్తలొస్తున్నాయి.
View this post on Instagram
A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore)
ఆర్‌సీబీ ఆటగాళ్ల పూర్తి జాబితా
విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్, ఫాఫ్ డుప్లెసిస్, అనూజ్ రావత్, దినేశ్ కార్తీక్(కీపర్), మహిపాల్ లోమ్‌రోర్, వానిందు హసరంగా, శబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జోష్ హజెల్ వుడ్, ఆకాశ్ దీప్, సిద్దార్థ్ కౌల్, కర్ణ్ శర్మ, ఫిన్ అలెన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, డేవిడ్ విల్లే, ప్రభుదేశాయ్, లువిత్ సిసోడియా, చామ మిలింద్, అనీశ్వర్ గౌతమ్.
9⃣ leaders locked, 1⃣ loading! ◾◾◾◾◽
________ should be #RCB‘s captain in #TATAIPL 2022 – fill in the blank 👇.#PlayBold #IPL2022 #IPL pic.twitter.com/OjJrxJVSK6
— Star Sports (@StarSportsIndia) March 7, 2022
View this post on Instagram
A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore)