ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా కోల్‌కతానైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సీజన్‌ను రెండు వరుస పరాజయాలతో ప్రారంభించినప్పటికీ.. ఆ తరువాత పుంజుకున్న తీరు అమోఘం. ఆ తర్వాత వరుసగా 3 విజయాలు సాధించిన సన్‌రైజర్స్ అదరగొట్టింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలయ్యామని చెప్పిన్నప్పటికే.. రాహుల్ త్రిపాఠి సూపర్ బ్యాటింగ్‌తో తమను కోలుకోనివ్వలేదని చెప్పుకొచ్చాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(3), కేన్ విలియమ్సన్ (17) విఫలమవడంతో 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. ఏ క్రమంలో ఎయిడెన్ మాక్రమ్‌తో జత కట్టిన రాహుల్ త్రిపాఠి వికెట్లు కోల్పోయినప్పటికీ ఏ మాత్రం ఒత్తిడిగా లోను కాకుండా తొలి బంతి నుంచే కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. మొదటి నుంచే ఫోర్లు, సిక్సులు కొట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన త్రిపాఠి.. ఆ తరువాత మరింత చెలరేగిపోయాడు. మొత్తంగా 6 సిక్సులు, 4 ఫోర్లతో 37 బంతుల్లోనే 71 పరుగులు చేసిన త్రిపాఠి జట్టుకు మూడో విజయాన్ని అందించాడు.
.@tripathirahul52 marched his way to a cracking 7⃣1⃣ & bagged the Player of the Match award as @SunRisers beat #KKR by 7⃣ wickets. 👏 👏
Scorecard ▶️ https://t.co/HbO7UhlWeq#TATAIPL | #SRHvKKR pic.twitter.com/aiuqSwNBU0
— IndianPremierLeague (@IPL) April 15, 2022
ఇది కూడా చదవండి: SRH హ్యాట్రిక్ విక్టరీ! నవ్వులు చిందించిన కావ్య పాప
ఓటమిపై కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి చాలా నిరాశకు గురిచేసింది. 175 పరుగుల లక్ష్యం పోరాడగలిగిందే. కానీ రాహుల్ త్రిపాఠి సూపర్ బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడు. సన్‌రైజర్స్ బౌలర్లు మంచి స్వింగ్ బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన కనబర్చారు.బ్యాటింగ్ లో రాణించినా.. దురదృష్టవశాత్తు బౌలింగ్‌లో విఫలమయ్యామని’ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
Dale Steyn opens up on his celebration when Umran Malik knocked over Shreyas Iyer’s stumps 💥
📷 IPL#IPL2022 #KKRHaiTaiyaar #OrangeArmy #SRHvKKR pic.twitter.com/r3zCzh6DIt
— Sportskeeda (@Sportskeeda) April 15, 2022
— Diving Slip (@SlipDiving) April 15, 2022
త్రిపాఠి మాట్లాడుతూ ‘కేకేఆర్‌పై ఇటువంటి ఇన్నింగ్స్ ఆడడం సంతోషంగా ఉంది. నాకు చాలా సార్లు కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ నేను కష్టపడి పని చేయడం వలన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వెళ్లే ముందు, నేను కొంచెం ఒత్తిడిలో ఉన్నాను. కానీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినందుకు ఆనందంగా ఉంది’ అని త్రిపాఠి పేర్కొన్నాడు.
A hat-trick of wins! 👏 👏
The Kane Williamson-led @SunRisers continue their fine run of form & bag 2⃣ more points as they beat #KKR by 7⃣ wickets. 👍 👍
Scorecard ▶️ https://t.co/HbO7UhlWeq#TATAIPL | #SRHvKKR pic.twitter.com/gRteb5nOAJ
— IndianPremierLeague (@IPL) April 15, 2022
Two pacers, same joy ☺️
Follow the match ▶️ https://t.co/HbO7Uh4Tcq#TATAIPL | #SRHvKKR | @SunRisers | @DaleSteyn62 pic.twitter.com/eGFGpj2QIL
— IndianPremierLeague (@IPL) April 15, 2022
ఇది కూడా చదవండి: సన్‌రైజర్స్ ఆటగాళ్ల ఫ్రిజ్‌ను బద్దలుకొట్టిన కేకేఆర్ బ్యాటర్!