భారతీయ మహిళల క్రికెట్ క్రీడాకారిణి వేదా కృష్ణమూర్తి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెలలో బెంగుళూరులోని ఆమె నిశ్చితార్ధం జరగబోతుందని వెల్లడించారు. కర్ణాటక బ్యాట్స్ మేన్ అర్జున్ హొయసాల, భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తిల నిశ్చితార్ధం సెప్టెంబర్ 18న బెంగుళూరులో జరగనుందని కుటుంబ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. ఈ సందర్భంగా అర్జున్ హొయసాల, వేదా కృష్ణమూర్తి.. ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అంతేకాదు, ‘తను ఒప్పుకుంది’ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు అర్జున్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. కోవిడ్ 19 కారణంగా తన తల్లిని, చెల్లిని కోల్పోయిన వేదా కృష్ణమూర్తి.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె భారత మహిళల క్రికెట్ జట్టులో లేరు. తిరిగి మళ్ళీ ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు, కర్ణాటక క్రికెటర్ అర్జున్ తో నిశ్చితార్థం కుదిరింది. దీంతో ఆమె కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. మరి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న వేదా కృష్ణమూర్తిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Indian women’s cricket team batter #VedaKrishnamurthy (@vedakmurthy08) is set to enter a new phase of life. Her family sources confirmed that her #engagement ceremony will be held in #Bengaluru on September 18.
Read: https://t.co/W63jLk0Rw9 pic.twitter.com/KV55QiRQIh
— Cricket Fanatic (@CricketFanatik) September 12, 2022