టీమిండియాలో సిక్సుల వీరుడు, విధ్వంసకర బ్యాట్స్‌మన్ అనగానే గుర్తొచ్చే పేరు యువరాజ్‌సింగ్. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. సోషల్ మీడియా వేదికగా యువీ ఎప్పుడూ అభిమానులకు చేరువగానే ఉంటాడు. ఫన్నీ వీడియోస్, కామెంట్స్ చేసే యువీ అందరికీ తెలుసు. ఈసారి యువీలోని మరో టాలెంట్‌ను బయటపెట్టాడు. ఇన్‌స్టా వేదికగా భారత పేసర్ ఇషాంత్ శర్మకు యువీ బర్త్ డే విషెస్ చెప్పాడు. అందులో ఏముందంటారా?. శుభాకాంక్షలు చెప్పింది ఎలాగో కాదు.. ఇషాంత్ శర్మ వాయితోనే చెప్పాడు. అది కూడా చాలా పర్ఫెక్ట్‌గా మిమిక్రీ చేశాడు.
ఆటపట్టించడానికే లంబూ, హ్యామీ బర్త్ డే అంటూ ఇన్‌స్టాలో విషెస్ చెప్తున్న పోస్ట్ చేశాడు యువరాజ్ సింగ్. ఇంకేముంది అది కాస్తా తెగ వైరల్ అయిపోయింది. మరి, ఆ వైరల్ పోస్టును మీరు చూసేయండి.