మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఒక కొత్త బ్రాండ్ గేమ్‌ను ఆడుతున్నాడు. ప్రపంచంలోనే గొప్ప ఆటగాడిగాపేరుతెచ్చుకున్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌తో పోలిక పొంది.. కొన్ని రోజులకే అతన్ని మరిపించే ప్లేయర్‌గా ఎదిగాడు. టీ20 క్రికెట్‌లో తనకు మాత్రమే సాధమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. టీమిండియాలో ఒక సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్న సూర్యుకుమార్ యాదవ్ ఆటతోనే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో డౌన్ టూ ఎర్త్‌గా ఉంటూ అందరితో సరదాగా ఉంటాడు. అందుకే సూర్యకుమార్ యాదవ్‌కు చాలా తక్కువ కాలంలోనే భారీ క్రేజ్ ఏర్పడింది. క్రికెట్ అభిమానులు సూర్య అంటే పడిచస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత.. టీమిండియాలో అంతటి క్రేజ్ ఉన్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.
ఇలా టీమిండియాలో ఒక స్టార్‌గా ఉన్న సూర్య అంటే ఇష్టపడని వారుండరు. కానీ.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్య చేసిన ఒక పనితో అతనిపై క్రికెట్ అభిమానులు కాస్తంత కోపం తెచ్చుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్టార్ ప్లేయర్ కావచ్చు కానీ.. మ్యాచ్‌లో మరో ఆటగాడిపై ఆ స్టార్‌డమ్ ప్రభావం పడకుండా చూసుకోవాలని ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకు ఏమైందంటే.. ఆదివారం లక్నోలో జరిగిన మ్యాచ్‌లో ఫిలిప్స్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ మూడో బంతిని సూర్య స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ.. బాల్ బ్యాట్, ప్యాడ్స్‌ను తాకి బ్యాక్‌వర్డ్ పాయింట్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. అయినా సూర్య సింగిల్ కోసం వెళ్లాడు. నాన్‌స్ట్రైకర్ ఎండ్ నుంచి వాషింగ్టన్ సుందర్ వద్దూ.. వద్దూ.. అని ఎంత వారిస్తున్నా.. వినకుండా పరుగు కోసం వచ్చాడు. మెరుపు వేగంతో బాల్ అందుకున్న టిక్నర్ కీపర్‌కు బాల్ అందించడంతో వాషింగ్టన్ సుందర్ రనౌట్ అయ్యాడు. సూర్య కోసం తన వికెట్‌ను సుందర్ త్యాగం చేశాడనే చెప్పాలి.
ఒక స్టార్ ప్లేయర్‌గా, టీ20 స్పెషలిస్ట్‌గా సూర్యకు గౌరవమిచ్చి సుందర్ తన వికెట్‌ను త్యాగం చేశాడు. వాషింగ్టన్ సుందర్ ప్లేస్‌లో విరాట్ కోహ్లీనో, రోహిత్ శర్మనో ఉండి ఉంటే.. కచ్చితంగా తమ వికెట్‌ను ఇచ్చేవారు కాదు. అసలు అక్కడ రన్ లేదు. అయినా కూడా సూర్య తప్పిదంతో టీమిండియా వికెట్ కోల్పోయింది. ఈ తప్పు చేసినా.. చివరి వరకు క్రీజ్‌లో నిలబడి తన సహజ శైలిని పక్కన పెట్టి చాలా నిదానంగా ఆడిన సూర్య ఎట్టకేలకు మ్యాచ్ గెలిపించడంతో ఈ విషయం వివాదాస్పదం కాలేదు. పైగా.. మ్యాచ్ తర్వాత సూర్య.. వాషింగ్టన్ సుందర్‌కు సారీ చెప్పి, తన తప్పుతోనే సుందర్ అవుట్ అయ్యడని ఒప్పుకోవడంతో సూర్యను క్రికెట్ అభిమానులు క్షమించారు. కానీ.. ఒక స్టార్ ప్లేయర్‌గా మరింత బాధ్యతతో ఆడాలని కోరుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Surya kumar should have been out and not Washington sundar
Sudar immediately said no but SKY was just running. pic.twitter.com/RyebMPnH2u
— All About Cricket (@allaboutcric_) January 29, 2023