కెప్టెన్సీ మార్పుతో వివాదాలు, కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి, ఇప్పటి వరకు సౌతాఫ్రికాలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవని నేపథ్యం.. ఇలాంటి అనేక ప్రతికూల అంశాల మధ్య మొదలైన సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా అంచనాలకు మించి రాణించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది.
కాగా ఈ గెలుపుతో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మరో గొప్ప గెలుపును సాధించాడు. అలాగే భారత్‌కు ఈ గ్రౌండ్‌లో ఇదే తొలి విజయం. ఈ సౌతాఫ్రికాకు బాగా అచ్చొచ్చిన గ్రౌండ్. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్‌లో ఆ జట్టు కేవలం మూడు మ్యాచ్‌లను మాత్రమే ఓడిపోయి..21 మ్యాచ్‌లలో గెలిచింది. 3 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కేవలం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ప్రొటీస్‌ను ఇక్కడ ఓడించాయి. ఇప్పుడు భారత్ కూడా ప్రొటీస్ జట్టును ఇక్కడి మట్టి కరిపించింది.
2010 డిసెంబర్‌లో ధోని సారథ్యంలో టీమిండియా సౌతాఫ్రికాతో టెస్ట్ ఆడింది. అప్పటి భారత జట్టులో సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి హేమాహేమీలు ఉన్నారు. అయిన కూడా ఆ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. మళ్లీ 11 ఏళ్ల తర్వాత ఇక్కడ విరాట్ కోహ్లీ సారథ్యంలో టెస్ట్ ఆడిన టీమిండియా ఐదు రోజుల మ్యాచ్‌లో ఒక రోజు వర్షం కారణంగా రద్దు అయినా కూడా అద్భుతమైన విజయం సాధించింది. మరి ధోని కెప్టెన్సీలో కూడా సాధ్యం కానిది.. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా సాధ్యమైంది. మరి ఈ గెలుపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీకి ఏమైంది? 2021 ఏమాత్రం కలిసిరాలేదు!