ఆసియా కప్ 2022 సమరానికి మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 27నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా, భారత జట్టు తన మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో తలబడనుంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్ చేతుల్లో పరాజయం తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో దీనికి భారీ హైప్ వచ్చేసింది. ఒకరికి ఈ మ్యాచ్ ప్రతీకారం తీర్చుకునేందుకు దొరికిన అవకాశం అయితే మరొకరికి పరువు కాపాడుకునేందుకు మిగిలిన మార్గం. అసలు ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్లు ఎన్ని సార్లు తలపడ్డాయి. మ్యాచుల లెక్కలు ఎలా ఉన్నాయి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియా Vs పాకిస్థాన్: ఆసియా కప్
1984 నుంచి ఇప్పటి వరకు ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌లు 14 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 8 సార్లు గెలుపొందగా, పాకిస్థాన్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 1997లో వర్షం కారణంగా ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.
1. 1984: భారత్, 54 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
2. 1988: భారత్, 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం.
3. 1995: పాకిస్థాన్, 97 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
4. 1997: ఫలితం లేదు.
5. 2000: పాకిస్థాన్, 44 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
6. 2004: మళ్లీ పాకిస్థాన్, 59 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
7. 2008: భారత్, 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం.
8. 2008: పాకిస్థాన్, 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం.
9. 2010: భారత్, 3 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం.
10. 2012: భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది
11. 2014: పాకిస్థాన్, 1 వికెట్ తేడాతో భారత్‌పై గెలుపు.
12. 2016: పాకిస్థాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం.
13. 2018: పాకిస్థాన్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం.
14. 2018: పాకిస్థాన్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం.
ఆసియా కప్- అత్యధిక విజయాలు:
ఆసియా కప్ టోర్నీలో అత్యధిక టైటిళ్లతో (7 టైటిళ్లు) భారత్ అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక 5, పాకిస్థాన్ 2 సార్లు మాత్రమే ఛాంపియన్స్ గా నిలిచాయి.
1. భారతదేశం – 7 (1984, 1988, 1990–91, 1995, 2010, 2016 & 2018)
2. శ్రీలంక – 5 (1986, 1997, 2004, 2008, 2014)
3. పాకిస్తాన్ – 2 (2000 & 2012)
మొత్తం 6 జట్లు ఆసియా కప్ 2022 టోర్నీలో పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటికే అర్హత సాధించగా, యుఎఇ, కువైట్, హాంకాంగ్, సింగపూర్ జట్ల నుండి ఒక జట్టు క్వాలిఫైయింగ్ రౌండ్ తర్వాత టోర్నమెంట్‌లో చేరుతుంది. ఆగష్టు 28న జరిగే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ తో పాటు OTT ప్లాట్‌ఫారమ్ Disney+ Hotstarలో కూడా వీక్షించవచ్చు. ఈసారి భారత్, పాకిస్తాన్ మ్యాచులో ఏ జట్టు విజయం సాధిస్తుందో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.