న్యూజిలాండ్ తో జరుగుతోన్న తొలి టీ20లో భారత్ విజయం కోసం పోరాడుతోంది. కివీస్ నిర్ధేసించిన177 లక్ష్య ఛేదనకు దిగిన ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (4), శుభ్‌మన్ గిల్ (7), రాహుల్ త్రిపాఠి (0).. ముగ్గురూ ఒకరివెంట మరొకరు పెవిలియన్ బాట పట్టారు. దీంతో 15 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య, హార్దిక్ పాండ్యా నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (4) పరుగులకే వెనుదిరిగాడు. బ్రేస్‌వేల్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి ఇషాన్ వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 10 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి ఎలాంటి మెరుపులు మెరిపించకుండానే పెవిలియన్ బాట పట్టాడు. జాకబ్ డఫీ ఓవర్‌లో కాన్వే క్యాచ్ పట్టడంతో డకౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం శాంటర్న్ బౌలింగ్ లో భారీ షాట్‌కు ప్రయత్నించి శుభ్‌మన్ గిల్ (7) వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో భారత్ 15 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.
Devon Conway is only the 2nd batsman after Virat Kohli to maintain 50+ average in T20I#IndvsNZ #t20 pic.twitter.com/MzhcBmqoSg
— Raghib Malik (@raghib76) January 27, 2023
Seeking solutions to Arshdeep’s no-balls, Hardik?#INDvNZ | #NZvIND pic.twitter.com/1vJi64ujCp
— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) January 27, 2023
కాగా, అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డెవోన్ కాన్వే 35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ (52) చేయగా, చివర్లో డారిల్ మిచెల్ రెచ్చిపోయాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. మిచెల్.. అర్షదీప్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. ఆఖరి ఓవర్లో 3 సిక్సులు, ఒక ఫోర్ సాయంతో 27 పరుగులొచ్చాయి.
MSD + Ranchi = 🤩
When the Ranchi crowd welcomed the legendary @msdhoni in style 😃👌#TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/40FoEDudSv
— BCCI (@BCCI) January 27, 2023