SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Im Better Player Than Virat Kohli Says Pak Cricketer Khurram Manzoor

కోహ్లీ కన్నా నేనే బెస్ట్ ప్లేయర్‌ని! పాకిస్థాన్ ఓపెనర్ వింత వాదన

    Published Date - Wed - 25 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
కోహ్లీ కన్నా నేనే బెస్ట్ ప్లేయర్‌ని! పాకిస్థాన్ ఓపెనర్ వింత వాదన

టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌, ఛేజ్‌ మాస్టర్‌, కింగ్‌ విరాట్‌ కోహ్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న మేటి ఆటగాళ్లలో అగ్రగణ్యుడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత అంతటి పేరుప్రఖ్యాతలు పొందుతున్న ఛాంపియన్‌ ప్లేయర్‌. కొన్ని వందల రికార్డులు బద్దలు కొడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా.. శిఖరాగ్రాలకు చేరుకున్నాడు. అలాంటి ఆటగాడితో పోల్చుకోవడానికే చాలా మంది మేటి క్రికెటర్లు సంకోచిస్తున్న తరుణంలో ఒక అనామక పాకిస్థాన్‌ క్రికెటర్‌ మాత్రం.. విరాట్‌ కోహ్లీ కంటే తానే బెస్ట్‌ ప్లేయర్‌నంటూ భారీ స్టేట్‌మెంట్‌ వదిలాడు. ప్రస్తుతం అతను చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ఖుర్రం మంజూర్ అనే పాకిస్థాన్‌ క్రికెటర్‌.. 2008లో పాకిస్థాన్‌ తరఫున తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 16 టెస్టులు, 7 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మంజూర్‌.. ఒక విషయంలో మాత్రం విరాట్‌ కోహ్లీ కంటే తానే గొప్ప క్రికెటర్‌నని.. నిజానికి తాను ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడినంటూ పేర్కొన్నాడు. 46 వన్డే సెంచరీలు, 27 టెస్టు సెంచరీలు, ఒక టీ20 సెంచరీతో మొత్తం మీద 74 సెంచరీలతో ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడి ఉన్నాడు కోహ్లీ. మంజూర్‌ గణాంకాలకు కోహ్లీ బాదిన పరుగులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కానీ.. ఒక్క విషయంలో మాత్రం కోహ్లీ తనకంటే వెనుకబడి ఉన్నాడని మంజూర్‌ చెప్పుకుంటున్నాడు. అదేంటంటే.. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో కోహ్లీ కన్వెర్షన్‌ రేట్‌ కంటే తన కన్వెర్షన్‌ రేట్‌ ఎక్కువగా ఉందని మంజూర్‌ పేర్కొంటున్నాడు. లిస్ట్‌ క్రికెట్‌లో కోహ్లీ యావరేజ్‌గా 6 ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ బాదితే.. తాను 5.5 ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ బాదిన రికార్డు ఉందని అంటున్నాడు.

ఈ ఒక్క రికార్డులో తాను కోహ్లీ కంటే ముందు ఉన్నానని.. కోహ్లీ కంటే కాదు.. ఈ రికార్డు విషయంలో తాను ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉన్నానంటూ మంజూర్‌ చెబుతున్నాడు. కోహ్లీ తన కెరీర్‌లో 305 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడి 14,251 పరుగులు సాధించాడు. అందులో 50 సెంచరీలు, 72 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అదే మంజూర్‌ విషయానికి వస్తే.. 166 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడి 7922 పరుగులు చేశాడు. అందులో 27 సెంచరీలు, 39 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అతని బ్యాటింగ్‌ యావరేజ్‌ 53.52, స్ట్రైక్‌రేట్‌ 85.06. లిస్ట్‌-ఏలో కోహ్లీ బ్యాటింగ్‌ యావరేజ్‌ 56.55, స్ట్రైక్‌రేట్‌ 93.78తో ఇలా అన్ని లెక్కల్లో మంజూర్‌ కంటే కోహ్లీ మెరుగ్గా ఉంటే.. అసలు లెక్కలోకే రాని కన్వెర్షన్‌ రేట్‌ను తీసుకొచ్చి.. కోహ్లీ కంటే తాను బెటర్‌ ప్లేయర్‌నంటూ మంజూర్‌ నవ్వులు పాలవుతున్నాడు. అయితే.. తనను తాను కోహ్లీతో పోల్చుకోవడం లేదని.. కానీ.. ఒక్క విషయంలో కోహ్లీ కంటే తాను బెటర్‌ అని మంజూర్‌ పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Khurram Manzoor who’s 36 made his International debut before Virat Kohli in an interview said

I am not comparing myself with Virat Kohli. Fact is, in 50-overs cricket, whoever are there in the Top 10, I am the world no.1
After me, stands Virat Kohli. pic.twitter.com/II4ZpvswJG

— Abhijeet ♞ (@TheYorkerBall) January 25, 2023

Tags :

  • Cricket News
  • IND VS PAK
  • Khurram Manzoor
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి!

ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి!

  • ఇండియా vs ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. హాజరుకానున్న ప్రత్యేక అతిథి!

    ఇండియా vs ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. హాజరుకానున్న ప్రత్యేక అత...

  • గిల్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ.. నిజానికి కివీస్ ని భయపెట్టింది ఇతడే!

    గిల్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ.. నిజానికి కివీస్ ని భయపెట్టిం...

  • వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

    వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

  • పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటున్న ఫ్యాన్స్

    పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటు...

Web Stories

మరిన్ని...

కాళ్లు చేతులు లేవు.. కానీ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌!
vs-icon

కాళ్లు చేతులు లేవు.. కానీ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌!

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..
vs-icon

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..
vs-icon

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

తాజా వార్తలు

  • K Viswanath Passed Away: కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

  • త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గొడవ ఈరోజుకీ తేలలేదు: పవన్ కళ్యాణ్

  • మీ నాన్నని చూసి నేర్చుకో.. పరువు తీయకంటూ షారుక్ ఖాన్ కొడుకు పై నెటిజన్స్ ఫైర్..

  • రికార్డు ధరకు పఠాన్ ఓటీటీ రైట్స్? స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఇదే!

  • ఓటీటీ వీకెండ్ ధమాకా.. రేపు ఒక్కరోజే 16 సినిమాలు రిలీజ్!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కి.మీ. వెళ్లొచ్చు! 2 బ్యాటరీలతో వస్తున్న సూపర్ వెహికల్!..

  • రూ.5 వేలలోపు.. ఎక్కువ మన్నిక కలిగిన మిక్సర్ గ్రైండర్లు ఇవే!

Most viewed

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • తారకరత్న..YCP ఎంపీ విజయసాయి రెడ్డికి దగ్గర బంధువు అని మీకు తెలుసా?

  • యాంకర్ విష్ణుప్రియ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత!

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam