సాధారణంగా క్రికెట్ లో మిస్ ఫీల్డ్ అవ్వడం, అందుకు అదనంగా పరుగులు రావడం సహజమే. ఒక్కోసారి సింగిల్ బాల్ లో మూడు పరుగులు కూడా వస్తుంటాయి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఘటనలో డాట్ బాల్ కు మూడు పరగులు వచ్చాయి. అది కూడా బాల్ ఫీల్డర్ల చేతిలో ఉంచుకునే.. మూడు పరుగులు సమర్పించుకోవడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా.. నవ్వులు పూయిస్తోంది. ఇంతటి అద్భుతం జరిగింది అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో కాదులెండి. చెక్ రిపబ్లిక్ లీగ్ లో జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది.
ప్రేగ్ బార్బేరియన్స్ Vs వినోహ్రాడీ మ్యాచ్ లో డాట్ బాల్ కి బ్యాటర్లు మూడు పరుగులు సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రేగ్ బార్బేరియన్స్ తొలి ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అర్షద్ హయత్ వైడ్ ఆఫ్ స్టంప్ బాల్ ని ఆడే క్రమంలో స్టెప్ అవుట్ అయ్యాడు కానీ, బాల్ కనెక్ట్ కాలేదు. ఆ బాల్ అందుకుని కీపర్ ఆర్మ్ త్రో చేశాడు.. కానీ, ఆ బాల్ స్టంప్స్ ని తాకలేదు.
వెంటనే బ్యాటర్లు సింగిల్ కోసం పరుగు పెట్టారు. బాల్ అందుకుని కీపర్ బౌలర్ కి విసిరాడు.. ఆ బాల్ అందుకోవడంలో బౌలర్ విఫలం కావడంతో రెండో రన్ కు వెళ్లారు. ఆ తర్వాత బౌలర్ బంతిని కీపర్ కు విసరగా మళ్లీ కీపర్ దానిని పట్టుకోలేదు.. ఆ విధంగా మొత్తం ఒక డాట్ బాల్ కి బ్యాట్స్ మన్లు 3 పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A Sim needs to learn to ground his bat and save himself extra running. They could of got 4. 🤣🤣🤣🤣 https://t.co/eoqvm68bCZ
— Brad Hogg (@Brad_Hogg) June 10, 2022