భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డే ముగిసింది. మనమే విజయం సాధించాం. అయితే ఈ మ్యాచులో హార్దిక్ పాండ్య.. మాజీ కెప్టెన్ కోహ్లీని అవమానించడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా.. అదే ఊపులో వన్డే సిరీస్ ని కూడా స్టార్ట్ చేసింది. ముంబయి వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచులో మన జట్టు అద్భుత విజయం సాధించింది. చాలా తక్కువ స్కోర్లు నమోదైన ఈ వన్డేతో కేఎల్ రాహుల్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. అయితే ఇందులోనే కోహ్లీ-హార్దిక్ మధ్య జరిగిన ఓ సంఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య మరీ ఇలా ప్రవర్తించాలని అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మనే ఉండాల్సింది. కానీ తన ఇంట్లో పెళ్లి ఉండటంతో ఈ మ్యాచుకు దూరమయ్యాడు. దీంతో హార్దిక్ కు పగ్గాలు అప్పగించారు. ఈ పోరులో బాగానే లీడ్ చేసిన హార్దిక్.. కోహ్లీ విషయంలో మాత్రం దారుణంగా ప్రవర్తించాడు. క్లియర్ గా చూసుకుంటే.. అది అవమానం కిందకే వస్తుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. 20 ఓవర్లలో 129/3తో ఆసీస్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న టైంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు.
ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన కోహ్లీ.. హార్దిక్ కు ఫీల్డింగ్ లో మార్పులు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే అదేం పట్టించుకోకుండా హార్దిక్ వెళ్లిపోవడం మనకు ఈ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది. ఆ వెంటనే కోహ్లీ.. హార్దిక్ ని చూస్తు ఏదో కోపంగా అన్నాడనిపిస్తుంది. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన కోహ్లీ మాట వినేంత టైం కూడా లేదా అని హార్దిక్ ని ట్రోల్ చేస్తున్నారు. సీనియర్లని గౌరవించాలి కానీ ఇంత ఘోరంగా అవమానిస్తారా అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వీడియో చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.
— CricAddaa (@cricadda) March 17, 2023