SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Hardik Pandya Clarifies Why Sanju Samson Not Get A Chance In New Zealand T20 Series

సంజు శాంసన్‌ను అందుకే ఆడించలేదు! విమర్శలపై నోరు విప్పిన హార్దిక్‌ పాండ్యా

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Wed - 23 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సంజు శాంసన్‌ను అందుకే ఆడించలేదు! విమర్శలపై నోరు విప్పిన హార్దిక్‌ పాండ్యా

టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఘోర వైఫల్యం తర్వాత న్యూజిలాండ్‌పై 1-0 తేడాతో టీమిండియా టీ20 సిరీస్‌ గెలిచింది. మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇక మూడో టీ20 వర్షం కారణంగా నిలిచిపోవడంతో డీఎస్‌ఎస్‌ పద్ధతి ప్రకారం టైగా ముగిసింది. దీంతో భారత్‌ సిరీస్‌ కైవసం చేసుకుంది. అయితే.. వరల్డ్‌ కప్‌ తర్వాత.. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, దినేష్‌ కార్తీక్‌, అశ్విన్‌, షమీలకు విశ్రాంతి ఇచ్చి.. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో యంగ్‌ టీమ్‌ను న్యూజిలాండ్‌తో టీ20కు పంపారు సెలెక్టర్లు. అప్పటికే వరల్డ్‌ కప్‌లో విఫలమైన ఆటగాళ్లను కూడా ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి.

అయినా కూడా వారిని పక్కన పెట్టి ఇతర యువ క్రికెటర్లకు తుది జట్టులో స్థానం కల్పిస్తారని అంతా భావించారు. కానీ.. హార్దిక్ పాండ్యా మాత్రం వరల్డ్‌ కప్‌లో దారుణంగా విఫలమైన రిషభ్‌ పంత్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ హుడాలకే అవకాశాలు ఇచ్చి.. సంజు శాంసన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, కుల్దీప్‌ యాదవ్‌ లాంటి ప్లేయర్‌ను పూర్తిగా బెంచ్‌కే పరిమితం చేశాడు. దీంతో పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిసింది. ముఖ్యంగా సంజు శాంసన్‌ను ఆడించకపోవడంపై క్రికెట్‌ అభిమానులు మండిపడ్డారు. ఫాస్ట్‌ బౌలింగ్‌ పిచ్‌లపై అద్భుతంగా ఆడే సంజును, గంటకు 156 కిమీ వేగంతో బౌలింగ్‌ వేసే ఉమ్రాన్‌ మాలిక్‌ను బెంచ్‌కు పరిమితం చేయడంపై మాజీ క్రికెటర్లు సైతం ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

Hardik Pandya

ఈ విమర్శలపై సిరీస్‌ ముగిసిన అనంతరం టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మీడియా సమావేశంలో స్పందించాడు. సంజు శాంసన్‌ను ఆడించకపోవడంపై మీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీరు ఏం చెబుతారు? అనే ప్రశ్నకు పాండ్యా బదులిస్తూ..‘బయట ఎవరో ఏదో చెబితే వాటిని మేము పట్టించుకోము. ఇది నా టీమ్‌. కోచ్‌తో చర్చించి.. అత్యుత్తమ జట్టును నేను ఎంపిక చేసుకుంటాను. అలాగే వారి బాధను సైతం నేను అర్థం చేసుకోగలను. ఆరోగ్యకరమైన చర్చకు వారి కోసం గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. వారొచ్చి నాతో మాట్లాడొచ్చు. ఇక సంజు శాంసన్‌ని అన్‌ఫార్చునేట్‌ కేస్‌. స్ట్రాటజీ కారణాలతోనే సంజును ఆడించలేకపోయాం.’ అని పాండ్యా వివరణ ఇచ్చుకున్నాడు.

కాగా.. అంత ప్రముఖ్యత లేని సిరీస్‌లో అప్పటికే వరల్డ్‌ కప్‌లో విఫలమైన ఆటగాళ్లను పట్టుకుని వేలాడే కంటే.. ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం సరైన పద్దతి అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అసలు ఏ మాత్రం ఉపయోగం లేని సిరీస్‌లో స్ట్రాటజీల పేరుతో ఓ ఆటగాడిని బెంచ్‌కే పరిమతం చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు. సిరీస్‌ డిసైడింగ్‌ మ్యాచ్‌లోనూ కివీస్‌ కెప్టెన్‌ ఆడకుండా.. యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చాడు. కెప్టెన్‌ అంటే అలా ఉండాలి. కానీ.. హార్దిక్‌ పాండ్యా తనను తాను ఎక్కువ ఊహించేసుకుంటున్నాడంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం తన కెప్టెన్సీలో సిరీస్‌ గెలవాలనే స్వార్థంతోనే సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వకుండా.. దారుణంగా విఫలం అవుతున్న పంత్‌నే ఆడించాడని అంటున్నారు.

Tags :

  • Cricket News
  • Hardik Pandya
  • IND Vs NZ
  • Sanju Samson
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam