టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ.. గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు టర్భోనేటర్.
గత కొన్ని రోజులు క్రితం టీమిండియా క్రికెట్ వర్గాల్లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ.. వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం.. భజ్జీ తన రిటైర్ మెంట్ తర్వాత చేసిన వ్యాఖ్యలే. “ధోని పట్ల యాజమాన్యం చూపించిన మద్ధతు, ఇతర ఆటగాళ్లకు లభిస్తే.. మాజీ క్రికెటర్లలో చాలా మంది మరికొన్ని సంవత్సరాలు టీమిండియాకు ఆడేవారు” అని భజ్జీ అన్నాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధోనికి తనకు విభేదాలు అన్న వార్తలపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు టర్భోనేటర్.
మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా క్రికెట్ చరిత్రలో తన పేరును సవర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. భారత చిరకాల స్వప్నం అయిన వన్డే వరల్డ్ కప్ ను సాధించి పెట్టి, టీమిండియాలో తిరుగులేని హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ తో ధోనికి విభేదాలు అన్న వార్తలు గతంలో గుప్పుమన్నాయి. ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం భజ్జీ తన రిటైర్మెంట్ తర్వాత చేసిన వ్యాఖ్యలే. యాజమాన్యం నుంచి ధోనికి లభించినట్లు మాకు మద్దతు లభిస్తే.. మాజీ క్రికెటర్లు మరికొంత కాలం క్రికెట్ ఆడేవాళ్లు అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ గా మారాయి. దాంతో ధోనికి భజ్జీకి మధ్య మనస్పర్థలు వచ్చాయని వార్తలు కోడైకూశాయి.
ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్య్వూలో మరోసారి స్పందించాడు భజ్జీ. హర్భజన్ మాట్లాడుతూ..”ధోని నేను ఎన్నో ఏళ్ల పాటు కలిసి క్రికెట్ ఆడాం. మేం చాలా మంచి స్నేహితులం. మా మధ్య గొడవలు ఎందుకు వస్తాయి. మేం వ్యక్తిగత జీవితాల్లో బిజీగా ఉండటంతో కలుసుకోలేకపోతున్నాం. అంతే తప్ప మా మధ్య విభేదాలు లేవు. మా మధ్య గొడవలు జరగడానికి ధోనీ నా ఆస్తులేం తీసుకోలేదు” అంటూ చమత్కరించాడు భజ్జీ. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు అన్న వార్తలకు చెక్ పెట్టాడు. ఇక ధోని ఆస్తులపై నేను ఆసక్తిగా ఉన్నాను అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ధోని ఫామ్ హౌస్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు ఈ టీమిండియా టర్భోనేటర్.
ఇక 2021 డిసెంబర్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు భజ్జీ. కాగ ధోని కెప్టెన్సీలో 31 టెస్టులు, 77 వన్డేలు, 25 టీ20 మ్యాచ్ లు ఆడాడు భజ్జీ. అదీకాక ఐపీఎల్ లో చెన్నై తరపున ధోనితో కలిసి భజ్జీ కొన్ని సీజన్ లు ఆడాడు. ధోనితో విభేదాలు అన్న వార్తలకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూతో చెక్ పెట్టాడు భజ్జీ. మరి హర్భజన్, ధోనితో ఉన్న విభేదాలపై, ధోనికి తనకు ఉన్న స్నేహంపై చెప్పుకోచ్చిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.