ఐపీల్ 2023 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో క్రికెట్ అభిమానులు మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నారు. దీంతో ఐపీఎల్ టికెట్స్ కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమిళనాడులో చెపాక్ సూపర్ లీగ్ నిర్వహిస్తున్న పోటీల్లో గెలిచిన వారికి టికెట్లను బహుమతిగా ఇచ్చారు.
ఐపీఎల్-2023 చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సగం మ్యాచ్ లు పూర్తైన ఈ సీజన్ లో మరికొన్ని మ్యాచ్ లో మాత్రమే మిగిలి ఉన్నాయి. అలానే ఈ సారి ఐపీఎల్.. క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతూ క్రికెట్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందిస్తుంది. క్రికెట్ ఫ్యాన్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారి సోషల్ మీడియా పేజీలో ఐపీఎల్ ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించింది. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటారు. అయితే టిక్కెట్లు లేకపోవడం, ఆర్ధిక స్థోమత, ఇతర కారణాలతో ఐపీఎల్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూడలేకపోతున్నారు. అయితే క్రికెట్ ఫ్యాన్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఓ మంచి అవకాశం కల్పిచిందింది. ఐపీఎల్ క్రికెట్ ను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పిస్తూ చైన్నె సూపర్ లీగ్ తమ అధికారిక సోషల్‌మీడియా పేజీల్లో బహుమతి పోటీని నిర్వహించింది. ఈ పోటీల్లో ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
సరైన సమాధానాలు చెప్పిన వారికి 25 ఉచిత ఐపీఎల్ టికెట్లను అందజేశారు. మరో 100 కన్సొలేషన్ ప్రైజ్‌లను చెపాక్ సూపర్ లీగ్ టీమ్ అందజేసింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ను ఉచిత టికెట్లు పొందిన క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా చూసి ఆనందంతో ఎగిరి గంతేశారు. ఈ సందర్భంగా భవేత్ రాజా అనే క్రికెట్ ఫ్యాన్ మాట్లాడుతూ.. ధోనిని ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కిందని హర్షం వ్యక్తం చేశాడు.
సేలంకు చెందిన రవీంద్రన్ మాట్లాడుతూ వర్షం కురిసినా టికెట్ కొనుగోలు చేసి.. చైన్నె సూపర్ కింగ్స్ మ్యాచ్ చూసేందుకు వచ్చానని చెప్పాడు. అలాగే చెన్నైకి చెందిన మిథున్ రాజ్ చెపాక్ స్టేడియంలో రాత్రంతా నిరీక్షించినా టికెట్టు దొరకలేదని, చెపాక్ సూపర్ లీగ్ నిర్వహించిన పోటీ ద్వారా ఉచిత టిక్కెట్ లభించిదని తెలిపాడు. దీంతో మ్యాచ్‌ను లైవ్‌గా చూసే అదృష్టం కలిగిందని అతడు వివరించారు. మరి.. తమిళనాడులో నిర్వహించిన ఈ పోటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.