సయీద్ అన్వర్.. 1997 వరకూ అతడో అనామక క్రికెటర్. అలాంటి వాడిని భారత జట్టే హీరోని చేసింది. చెన్నై వేదికగా జరిగిన ఇండియా - పాక్ వన్డే మ్యాచులో అన్వర్ 194 పరుగులు చేయడంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచానికి హీరో అయిపోయాడు. ఆనాటి నుంచి సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ(200; 2010) చేసే వరకు వన్డేల్లో అదే అత్యుత్తమ స్కోర్. ఆ ఒక్కటి తప్ప అతని కెరీర్ లో అంత పెద్ద గొప్ప ఇన్నింగ్స్ లు ఏమీ లేవు. ఆ ఒక్క ఇన్నింగ్స్ ను చెప్పుకొని.. 2003 వరకు జట్టులో కొనసాగాడు. ఆపై ఫామ్ కోల్పోయి జట్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు.
సయీద్ అన్వర్.. 1997 వరకూ అతడో అనామక క్రికెటర్. అలాంటి వాడిని భారత జట్టే హీరోని చేసింది. చెన్నై వేదికగా జరిగిన ఇండియా – పాక్ వన్డే మ్యాచులో అన్వర్ 194 పరుగులు చేయడంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచానికి హీరో అయిపోయాడు. ఆనాటి నుంచి సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ(200; 2010) చేసే వరకు వన్డేల్లో అదే అత్యుత్తమ స్కోర్. ఆ ఒక్కటి తప్ప అతని కెరీర్ లో అంత పెద్ద గొప్ప ఇన్నింగ్స్‌లు ఏమీ లేవు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌ను చెప్పుకొని.. 2003 వరకు జట్టులో కొనసాగాడు. ఆపై ఫామ్ కోల్పోయి జట్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఇదిలావుంటే.. తాజాగా, ఈ ఓపెనర్ తన ఉనికి కోసం భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
మతపెద్దగా ఓ ప్రదేశంలో జన సమూహం ముందు ఉపన్యాసం ఇచ్చిన అన్వర్.. ప్రధాని మోదీని ప్రస్తావిస్తూ.. “ముస్లింలు అజాన్ (ముస్లింల ప్రార్ధనా సమయానికి ముందు ఇచ్చే పిలుపు) ఇచ్చేటప్పుడు మోదీ ఎన్నిసార్లు ప్రసంగాలు ఆపినా సైతాన్ ఆవహించిన హిందువుగానే మిగిలిపోతాడంటూ.. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ అన్‌టోల్డ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా, వైరలవుతోంది. అన్వర్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాక మత పెద్దగా అవతారమెత్తిన అన్వర్.. ఇలా వ్యాఖ్యానించడం సరి కాదని, నిజానిజాలు తెలుసుకోవాలని బుద్ధి చెప్తున్నారు.
“It doesn’t matter how many times you stop your speech for Azan
You will remain a Satan-possessed Hindu.”
BTW this Mullah is ex Pak cricket captain Saeed Anwar who Indian Hindus hosted countless times. Imagine the hate in commoners. pic.twitter.com/tRhdSQ2HJL
— Pakistan Untold (@pakistan_untold) March 5, 2023
కాగా, గతేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ఓ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ప్రసంగిస్తుండగా సమీపంలో ఉన్న ఓ మసీదులో అజాన్ ఇచ్చారు. ఆ సమయంలో మోదీ ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ.. కొద్దిసేపు తన ప్రసంగాన్ని నిలిపి వేశారు. అలాగే, జమ్మూకాశ్మీర్ పర్యటనలో బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా కూడా అదే చేశారు. సమీపాన ఉన్న మసీదు నుంచి ఆజాన్ వినపడగానే తన ప్రసంగాన్ని ఆపేశారు. అలా ఇతర మతాలను గౌరవిస్తూ మోడీ, షాలు చేసిన పనికి దేశ ప్రజల నుంచే గాక ఇతర దేశాల ప్రజల కూడా ప్రశంసలు పొందారు. కానీ అన్వర్ మాత్రం అందులో కూడా తప్పులు వెతికే ప్రయత్నం చేయడం గమనార్హం.
Watch, when India PM NarendraModi halts his speech midway for Azan 👇 https://t.co/HHPWONF4IG pic.twitter.com/bDYtrtov6E
— Facts check (@Facts_chek) April 6, 2022
1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసిన సయీద్ అన్వర్ 2003 వరకు జట్టులో ఉన్నాడు. చివరగా 2003లో జింబాబ్వేతో మ్యాచ్ ఆడాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాక మత పెద్దగా అవతారమెత్తి, ఉపన్యాసాలు ఇస్తున్నాడు. కెరీర్ లో 55 టెస్టులు, 247 వన్డేలు ఆడిన అన్వర్, టెస్టులలో 4,052, వన్డేలలో 8,824 పరుగులు చేశాడు. వన్డేలలో 194 పరుగులు చేయడమే అతని కెరీర్ లో గొప్ప మైలురాయి. అన్వర్ వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.