టెస్ట్ ఫార్మాట్ ఆదరణ కోల్పోతున్న సమయంలో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపినయన్‌షిప్ ఫైనల్ కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసందే. 2019 లో తొలిసారి స్టార్ట్ అయిన ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. ఏ ఫార్మాట్ కి మళ్ళీ తిరిగి పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా రెండేళ్లలో అత్యున్నత ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ ని ఆడతాయి. 2021 తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ న్యూజిలాండ్, భారత్ మధ్య జరగ్గా.. కివీస్ ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. మళ్ళీ ఈ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కి వరుసగా రెండోసారి అర్హత సాధించిన టీమిండియా.. ఈ సారి ఆస్ట్రేలియాతో తుదిపోరుకి సిద్ధమైంది. అయితే ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఒక ప్రత్యేకమైన బంతిని ఉపయోగించనున్నారు. ఆ బంతి పేరు డ్యూక్స్ బాల్. ఇంతకీ ఈ డ్యూక్స్ బాల్ స్పెషల్ ఏంటి?
ప్రస్తుతం టెస్టులు ఆడుతున్న దేశాలు ఆస్ట్రేలియాలో తయారైన కొకాబుర్రా బంతులను వాడతాయి. అయితే ఇప్పుడు కొత్తగా డ్యూక్ బాల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. వీటి గురించి మాట్లాడుకోవాలంటే చాలా పెద్ద చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తుంది. క్రికెట్ ప్రారంభమైన రోజుల్లోనే ఈ డ్యూక్స్ ఉపయోగించే వాళ్ళని తెలుస్తుంది. 1760లో ఈ బాల్‌ను తొలిసారిగా ఉపయోగించేవారట. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా.. డ్యూక్స్ బాల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. దీనికి, మామూలుగా టెస్టుల్లో ఉపయోగించే ఎర్ర బంతికి చాలా తేడా ఉంటుంది. వీటిని ఇంగ్లండ్‌లోని డ్యూక్స్ క్రికెట్ కంపెనీ తయారుచేస్తుంది. మామూలుగా టెస్టుల్లో వాడే ఎస్‌జీ బాల్ కంటే ఇది చాలా స్పెషల్. చూడ్డానికి ఒకేలా కనిపించే ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడాలు ఉంటాయి.
సాధారణంగా టెస్టుల్లో ఉపయోగించే రెడ్ బాల్ కొన్ని ఓవర్లు వేసేసరికి పాతపడిపోతుంది. కానీ డ్యూక్స్ బాల్ అలా కాదు. ఈ బాల్ తొందరగా మెరుపును కోల్పోదు. ఈ రెండు రకాల బంతులకు చేతితోనే కుట్లు వేస్తారు. దాంతో, ఇవి ఎక్కువ స్వింగ్ అవుతాయి. డ్యూక్స్ బాల్ రెండు వైపులా వెనక నుంచి ముందుకు ఆరు కుట్లు కనిపిస్తాయి. దాంతో, ఆ బంతి ఎక్కువ సేపు తన ఆకారాన్ని కోల్పోదు. దృఢంగా కూడా ఉంటుంది. అయితే.. ఎర్ర బంతి మీద దారం పోగులు దగ్గర దగ్గరగా ఉంటాయి. అయితే ఈ డ్యూక్ బాల్స్ తో ఇటీవలే ఐపీఎల్ లో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడం విశేషం. అక్షర్ పటేల్ తాజాగా వీటిపై వివరణ ఇచ్చాడు. “ఐపీఎల్ ప్రారంభానికి ముందే డబ్ల్యూటీసీ ఫైనల్లో డ్యూక్స్ బాల్ వాడతారనే విషయం మాకు తెలిసింది. అందుకని మేము ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం. దాంతో, ప్రాక్టీస్ చేశాం. ఆ బంతిని ఎలా ఎదుర్కోవాలి? దాంతో, స్వింగ్‌ను ఎలా రాబట్టాలి? అనేది తెలుసుకున్నాం” అని అక్షర్ తెలిపాడు. మొత్తానికి ఈ డ్యూక్ బాల్ ప్రాక్టీస్ భారత ఆటగాళ్లకు ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.