సోషల్ మీడియా వాడకం పెరిగాక కొంత మంది ఓవర్ నైట్ లో స్టార్లుగా మారిపోతున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం తీరిక సమయాల్లో రీఫ్రెస్ అవ్వడానికి సోషల్ మీడియాల్లో వీడియోలు చేస్తుంటారు. తాజాగా ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది. ఆ వీడియో మరెవరిదో కాదు.. ఆస్ట్రేలియా డ్యాషింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ది. వార్నర్ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటాడన్న సంగతి మనందరికి తెలిసిందే. కరోనా సమయం నుంచి తెలుగు పాటలకు డబ్ స్మాష్ చేస్తూ.. ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు వార్నర్ భాయ్. ఈ క్రమంలోనే మరో వీడియోతో సోషల్ మీడియాలో నిలిచాడు. ఈ సారి ఏకంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లా మారిపోయాడు వార్నర్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా డ్యాషింగ్ బ్యాటర్ గా తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ ద్వారా హైదరాబాద్ తో పాటు తెలుగు వారికి దగ్గరైయ్యాడు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అయిన వార్నర్ భాయ్ విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు కూడా. అయితే ప్రస్తుతం వార్నర్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వార్నర్ సహజంగానే సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన డ్యాన్స్ విన్యాసాలను అభిమానులతో పంచుకుంటుంటాడు.
అందులో భాగంగానే నితిన్, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘భీష్మ’ మూవీలోని ‘వాటే వాటే వాటే బ్యూటీ’ అనే పాటకు రష్మిక ఫేస్ ను తన ఫేస్ లా మార్చి ఎడిట్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. అదీ కాక ఈ వీడియోను చేసినందుకు సో సారీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు వార్నర్ భాయ్. ఇక డేవిడ్ ఇంతకు ముందు చేసిన ఎడిట్ లు అన్నీ ఒకెత్తు అయితే రష్మికది మాత్రం ఒకెత్తు. గతంలోనూ పుష్ఫ మూవీ స్పూఫ్ లతో వార్నర్ అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వార్నర్ మామకు కళాపోషణ ఎక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వార్నర్ వీడియోలను మార్చి స్ఫూప్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ హీరో మహేశ్ బాబు పాటలను, డైలాగ్స్ ను తన ఫేస్ తో మార్చుకుని రచ్చలేపిన విషయం మనందరికి తెలిసిందే.