పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా నిప్పులు చెరిగాడు. తాజాగా ఏఎన్‌ఐ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిది ఓ క్యారెక్టర్ లెస్ ఫెలో అని, అబద్దాలకోరని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘ఇద్దరం కలిసి చాలా ఏళ్లపాటు పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాం. అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు నన్ను ఎక్కువగా బెంచ్‌కే పరిమితం చేసేవాడు. అతని మూలంగా చాలా వన్డే మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. అందరు ఆటగాళ్ల ముందే అవమానపరుస్తూ మాట్లాడేవాడు. అంతేకాదు నేను హిందువునని.. దేశంలో నాకు చోటు లేదని.. జట్టు నుంచి బహిష్కరించాలని సహచరులకు చెప్పేవాడు’.
‘అఫ్రిది మాటలను నేను ఏనాడూ పట్టించుకోలేదు. క్రికెట్‌పైనే ద్రుష్టి పెట్టేవాడిని. ఎందుకంటే.. ఆఫ్రిది ఒక వ్యక్తిత్వం లేని మనిషని నాకు తెలుసు. జట్టులో ఉన్నంతకాలం అతను ద్వేషించినా నేను భరించేవాడిని. నేనంటే అతనికి ఎందుకంత అసూయ నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఒక్కటి చెప్పగలను. పాకిస్థాన్ జట్టుకు ఆడటం నా అదృష్టంగా భావిస్తా.. నా జీవితంలో అదో గొప్ప విషయం’ అని కనేరియా చెప్పుకొచ్చాడు.
Former Pakistan spinner Danish Kaneria revealed that his ex-teammate Shahid Afridi has played a big part in his omission from the ODI squad.#Crickettwitter pic.twitter.com/MTmomXn2Tj
— CricTracker (@Cricketracker) April 29, 2022
ఇది కూడా చదవండి: T20 World Cup 2022: బౌలింగ్ బలంతోనే టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా! బ్యాటింగ్ తుస్సే
2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కనేరియా పాక్ తరపున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. 2009లో ఇంగ్లీష్ కౌంటీ చాంపియన్‌షిప్ ప్రో లీగ్‌లో కనేరియా స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణ రావడం, అవి కాస్తా నిజమని తేలడంతో 2012లో ఇంగ్లీష్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతనిపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని అప్పట్లో పీసీబీ కూడా సమర్థించింది.
ఈ విషయంపై స్పందించిన కనేరియా.. ‘క్రికెట్‌లో ఫిక్సింగ్ చేసిన ఎంతో మంది ఆటగాళ్లు.. నేడు బయట యథేచ్చగా తిరుగుతున్నారు. కానీ నాపై ఉన్న నిషేధాన్ని మాత్రం పీసీబీ తొలగించలేదు. ఒక దేశానికి క్రికెట్ ఆడాను.. నిషేధం తొలగిస్తే ప్రైవేట్ లీగ్‌ల్లో ఆడాలని ఉంది. పీసీబీని నేను అడిగేది ఒక్కటే.. నాపై బ్యాన్ ఎత్తేయండి.. నా పనేదో నేను చూసుకుంటా’ అని పేర్కొన్నాడు.
Danish Kaneria on Shahid Afridi pic.twitter.com/iBZMjTI4Vq
— RVCJ Media (@RVCJ_FB) April 29, 2022
Here’s Shoaib Akhtar revealing that senior Pakistani players like Shahid Afridi (referred to as ‘Kaptaan’) complained why Danish Kaneria (a Hindu) was eating from the same table as the others.
Shoaib says he protested against such discrimination.pic.twitter.com/rIwcxwskXV— Soumyadipta (@Soumyadipta) December 30, 2019