చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఐపీఎల్ కప్ కొట్టడంలో ఎక్స్ పర్ట్. కానీ ఈ సీజన్ లో ఆ స్పార్క్ ఎందుకో మిస్ అయినట్లు కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో చాలా పొరపాట్లు చేస్తూనే ఉంది. ఇంతకీ అవేంటి?
చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే ఫస్ట్ ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ధోనీనే. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ ఇదే జట్టుకి కెప్టెన్ గా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ప్రతి సీజన్ లోనూ సీఎస్కే.. టాప్-4లో ఉండేలా చేస్తున్నాడు. ఈ జట్టు ఖాతాలో నాలుగు ట్రోఫీలు కూడా ఉన్నాయి. ఇలా ఏ యాంగిల్ లో చూసుకున్నా సరే చెన్నై జట్టుని వంక పెట్టడానికి ఏం లేదు. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు సీన్ చాలావరకు మారిపోయింది. స్టార్ ఆటగాళ్లు పెద్దగా ఎవరూ లేరు. దీంతో జట్టులో యువ ఆటగాళ్లు చాలావరకు తప్పిదాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్సీబీ మ్యాచ్ లోనూ అలాంటివే చాలా జరిగాయి. కానీ ఎలాగోలా గెలిచేశారు. ఇంతకీ చెన్నై టీమ్ ఎక్కడ పొరపాట్లు చేస్తోంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే అందరూ ఆహో ఓహో అంటారు కానీ ప్రస్తుత సీజన్ లో బ్యాటింగ్ పరంగా బాగానే ఉంది. ఓపెనర్లు రుతురాత్, కాన్వేతోపాటు వన్ డౌన్ లో దిగుతున్న రహానె దంచి కొడుతున్నాడు. అప్పుడప్పుడు శివమ్ దూబే, రాయుడు, మొయిన్ అలీ, జడేజా, ధోనీ తలో చేయి వేస్తున్నారు. ఇలా బ్యాటింగ్ పరంగా బాగానే ఉంది. కానీ బౌలర్లు పూర్తిగా తడబడుతున్నారు. పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఈ సీజన్ కు దూరమయ్యాడు. దీంతో సరైన ఫాస్ట్ బౌలర్లు లేరు. ఉన్న కుర్రాళ్లకు అనుభవం లేకపోవడంతో పరుగులు సమర్పించేస్తున్నారు. స్పిన్ పరంగా జడేజా, మొయిన్ అలీ కొన్నిసార్లు కట్టడి చేస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ల వల్ల కావట్లేదు.
బ్యాటింగ్, బౌలింగ్ గురించి అయిపోయింది కదా ఇప్పుడు ఫీల్డింగ్ గురించి మాట్లాడుకుందాం. చెన్నైలో రైనా, డుప్లెసిస్ లాంటి వాళ్లు ఉన్నప్పుడు అద్భుతంగా ఫీల్డింగ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు చాలావరకు కుర్రాళ్లే ఉండటంతో ఎందుకో వాళ్లు కాస్త భయపడుతున్నట్లు అనిపిస్తుంది. ఆర్సీబీ మ్యాచ్ లోనూ కొన్ని క్యాచ్ డ్రాపులు ఉన్నాయి. ధోనీ కూడా డుప్లెసిస్ క్యాచ్ వదిలేశాడు. ఇలా బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో పొరపాట్లు చాలావరకు సరిదిద్దుకోవాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్నది లీగ్ దశ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం చెన్నైకి డేంజర్ బెల్స్ మోగినట్లే అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
IPL 2023 Points Table – CSK moves to No.3 now. pic.twitter.com/0RjEyBHdmJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 17, 2023