క్రీడల్లో బాగా ఆడినవారికి బహుబతులు ఇవ్వడం సాధారణమే. జట్టు విజయం కోసం కృషి చేసిన వారికి ప్రైజ్‌లు ఇస్తుంటారు. అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన వారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లాంటి పురస్కారాలతో ప్రోత్సహిస్తుంటారు. క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ.. ఇలా ఆట ఏదైనా అవార్డులను ఇవ్వడం సర్వసాధారణం. అవార్డు కింద షీల్డ్ లేదా నగదు బహుమతి ఇస్తుంటారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన ప్లేయర్లకు కూడా షీల్డ్, నగదు బహుమతిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఒక్కోసారి కార్లు, బైక్‌లను కూడా అవార్డుల కింద ఇస్తుంటారు.
ఈ బహుమతులు ఆటగాళ్లకు తీపిగుర్తులుగా చిరకాలం గుర్తుండిపోతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవార్డులు ఇవ్వడం కామన్ అనుకున్నారో ఏమో గానీ.. ఒక చోట మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఓ వెరైటీ బహుమతిని ఇచ్చారు. అవార్డు కింద రెండున్నర కిలోల బరువున్న చేపను ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన కశ్మీర్‌లో చోటుచేసుకుంది. కశ్మీర్‌లోని టేకిపోరా, కుప్వారాలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ప్లేయర్‌కు 2.5 కిలోల చేపను అందించారు. దీంతో అవార్డు అందుకున్న ఆటగాడు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఈ టోర్నమెంట్ పాపులర్ అయ్యేందుకే ఇలా చేశామని నిర్వాహకులు చెప్పారు. టోర్నీ నిర్వహణకు ఆర్థిక కష్టాలు ఏర్పడటంతో ప్లేయర్లు తమ జేబుల్లో నుంచి డబ్బులు పెట్టుకున్నారని సమాచారం. అయితే ఆటగాడికి చేపను బహుమతిగా ఇస్తున్న ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రోఫీలు ఇచ్చినా అవి అలంకరణకే పనికొస్తాయని.. వాటి బదులు ఇలా చేపలు లాంటివి ఇస్తే, ప్లేయర్లకు మంచి డైట్‌గా ఉపయోగపడుతుందని నెటిజన్స్ అంటున్నారు. ఈ ఫొటో, వార్త పాతదే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Recently, in a cricket match at Tekipora Kupwara, a 2.5 Kg fish was given as Man of the Match award. #CricketDhamaka#ESPN #IPL2020 #kashmircricket pic.twitter.com/fQ7VAJ7Gvb
— Firdous Hassan (@FirdousHassan) September 21, 2020