బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో సర్‌ప్రైజ్‌లతో పాటు భారీ షాక్‌లు తగులుతున్నాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ చటేశ్వర్ పుజారాను ఏ ఫ్రాంచైజ్ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో ఉన్న పుజారాను అన్ని జట్లు వద్దనుకున్నాయి. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ పుజారాను కొనుగొలు చేసింది. కానీ ఈ సారి మాత్ర పుజారాకు నిరాశే ఎదురైంది. మరి పుజారాను ఏ జట్టు కొనుగోలు చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.