మన లైఫ్ లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అవి క్రాస్ అయినప్పుడు కొన్ని మంచి విషయాలు జరుగుతుంటాయి. బహుశా మన ఆలోచనల్లో, వ్యవహరించే తీరులో మార్పుల వల్లే ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే విషయాన్ని క్రికెటర్లకు అన్వయించుకుంటే.. పలువురు కెప్టెన్స్ వాళ్లకు పిల్లలు పుట్టిన కొన్నిరోజులకే కప్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఓ కొత్త పెళ్లి కొడుకు ఏకంగా మ్యాచ్ ని గెలిపించి చూపించాడు. టార్గెట్ ఫినిష్ చేయడంలో కీలకపాత్ర పోషించి, ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గానూ నిలవడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పల్లెకెలే వేదికగా శ్రీలంక-అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో ఆతిథ్య లంక జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. మరో రెండు బంతులు మిగిలుండగానే టార్గెట్ ఫినిష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘన్ జట్టు, 50 ఓవర్లలో 313 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ జద్రాన్ 162 పరుగులతో అదరగొట్టాడు. నజీబుల్లా 77 పరుగులతో రాణించాడు. అనంతరం ఛేదనలో లంక బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్లు నిస్సంక(35), కుశాల్ మెండిస్ (67) అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. కానీ 15 పరుగుల డిఫరెన్స్ లోనే మూడు వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. కానీ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అసలంక (83 నాటౌట్) తో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కాలిగాయం వేధిస్తున్నా సరే జట్టుకు విజయాన్ని అందించాడు.
ఇదిలా ఉండగా.. అప్ఘానిస్థాన్ తో వన్డే సిరీస్ మధ్యలోనే ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు పెళ్లి చేసుకున్నారు. కసున్ రజిత, చరిత్ అసలంక, పతుమ్ నిస్సంక.. నవంబరు 28న వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నారు. ఇక మ్యారేజ్ జరగడానికి ముందు బ్యాటింగ్ విషయంలో పూర్తిగా నిరాశపరుస్తూ వచ్చాడు. పెళ్లి జరిగిన తర్వాత రోజే రెచ్చిపోయాడు. మ్యాచ్ ని గెలిపించాడు. దీంతో వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం శ్రీలంక, తన ఛాన్సులను మెరుగుపరుచుకుంది. అయితే లంక కంటే ముందు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు రేసులో ఉన్నాయి. వీటిని దాటుకుని టాప్-8లో నిలవడం శ్రీలంక జట్టుకు కుదరకపోవచ్చు. ఇదంతా పక్కనబెడితే.. పెళ్లి తర్వాత రోజే గ్రౌండ్ లోకి దిగి, అసలంక మ్యాచ్ ని గెలిపించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
No surprises here! The Player of the Match award goes to Charith Asalanka
🫳🏏#SLvAFG pic.twitter.com/Ww2enZhDJg— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 30, 2022
Congratulations to Charith Asalanka, Pathum Nissanka and Kasun Rajitha! 💍🎉 pic.twitter.com/qlUZKtOMVG
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 28, 2022