ఐపీఎల్.. ఇండియన్ క్రికెట్ గతిని, స్థితిని మార్చిన రిచ్ లీగ్ ఇది. ఇప్పుడు కూడా దేశమంతటా ఐపీఎల్ సందడి నడుస్తూనే ఉంది. 16 ఏళ్లుగా ఐపీఎల్ స్టాండర్డ్స్ పెరుగుతూనే వచ్చాయి. ఇందుకే ఈ లీగ్ కి ఇండియాలోనే కాదు ప్రపంచం అంతటా క్రేజ్ ఉంది. వివిధ దేశాలకు చెందిన లెజండ్రీ క్రికెటర్స్ కూడా ఐపీఎల్ పై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కూడా ఇందుకు అతీతం ఏమి కాదు. తాజాగా బ్రెట్ లీ తన దృష్టిలో ఐపీఎల్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్లేయర్ ఎవరో ఓపెన్ గా చెప్పేశాడు. బ్రెట్ లీ లాంటి వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే.. ఆ ప్లేయర్ ఏ కోహ్లీనో, రైనానో, ధోనీనో అయ్యుంటాడు అనుకుంటే మీరు పొరబడినట్టే! ఎందుకంటే బ్రెట్ లీ దృష్టిలో ఐపీఎల్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్లేయర్ ఓ సాధారణ స్పిన్ బౌలర్.
ఐపీఎల్ లో భాగంగా స్ట్రీమింగ్ పార్ట్నర్ అయిన జియో సినిమా ఇంటర్వ్యూ లో బ్రెట్ లీకి ఓ ప్రశ్న ఎదురైంది. మీ దృష్టిలో ఐపీఎల్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్లేయర్ ఎవరు అని అడగగా.. స్పీడ్ స్టార్ ఏ మాత్రం తడుముకోకుండా “యుజ్వేంద్ర చాహల్” పేరు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. బ్రెట్ లీ అంత దైర్యంగా చాహల్ పేరు చెప్పడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించినా.. ఐపీఎల్ స్టాట్స్ ప్రకారం ఆలోచించి చూస్తే బ్రెట్ లీ కామెంట్స్ సీరియస్ గా తీసుకోక తప్పదు. “యుజ్వేంద్ర చాహల్” ఐపీఎల్ ఇప్పటి వరకు 145 మ్యాచ్ లు ఆడి.. 187 వికెట్స్ ని సొంతం చేసుకుని.. అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఎకానమీ కూడా 8 కన్నా తక్కువే ఉండటం విశేషం. ఇక చాహల్ యావరేజ్ కూడా 21 మాత్రమే ఉండటం గమనార్హం. టీ ట్వంటీ ఫార్మేట్ లో ప్రతి 21 బాల్స్ కి ఒక్క తీయగలగడం చాలా గొప్ప విషయం. ఒక్క రషీద్ ఖాన్ మినహా ఇప్పట్లో ఎవ్వరూ చాహల్ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
2011లో ముంబై టీమ్ తో తన ఐపీఎల్ జర్నీ స్టార్ట్ చేసిన చాహల్.. ఆ తరువాత బెంగుళూరు జట్టుకి మారి మరింత మెరుగయ్యాడు. ఇక గత రెండు సీజన్స్ నుండి “యుజ్వేంద్ర చాహల్” రాజస్థాన్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. కానీ.. ఇంత సాధించినా “యుజ్వేంద్ర చాహల్” ను ఐపీఎల్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్లేయర్ గా ప్రేక్షకులు గుర్తించకపోవడానికి కారణం ఉంది. టీ ట్వంటీ క్రికెట్ లో అంతా బ్యాట్స్మెన్స్ హవా పెరిగిపోయింది. ఇలాంటి స్థితిలో గ్రేటెస్ట్ ప్లేయర్స్ అంటే.. అంతా కోహ్లీ, రైనా, ధోని పేర్లు చెప్తారే గాని.., బౌలర్ ని గుర్తు పెట్టుకోవడం కష్టం. కానీ.. బ్రెట్ లీ లాంటి ఓ లెజండ్రీ బౌలర్ ఇచ్చిన స్టేట్మెంట్ తో ఇప్పుడు అందరి కళ్ళు చాహల్ పై పడ్డాయి. మరి .. మీ లెక్క ప్రకారం ఐపీఎల్ లో “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్లేయర్” గా ఎవరిని ఎన్నుకుంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.