అంపైర్లు వివాదస్పద నిర్ణయాలు ప్రకటించడం.. ఆటగాళ్లు వారితో వాగ్వాదానికి దిగడం.. ఇవి ఎప్పుడూ చోటుకునే సంఘటనలే. కాకుంటే..ఈ గొడవలో ట్విస్టులు ఎక్కువున్నాయి. ఇక్కడ అంపైర్ల నిర్ణయం సరైనదే అయినప్పటికీ.. ఐదు నిమిషాల అనంతరం నిర్ణయం ప్రకటించడం వివాదానికి తెరలేపింది. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాక్ – బంగ్లా ఆటగాళ్లు వారితో వాగ్వాదానికి దిగారు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతోన్న బీపీఎల్ టోర్నీలో ఇది చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బీపీఎల్‌లో ఆటగాళ్లు-అంపైర్ల మధ్య గొడవలు కొత్తేమీ కాదు. టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి ప్రతి సీజన్‌లోనూ ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్యనే బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్.. తప్పుడు నిర్ణయం ఇచ్చాడని అంపైర్‌ను కొట్టబోయేంత పనిచేశాడు. దాదాపు ప్రతి మ్యాచులో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, రంగ్‌పూర్ రైడర్స్ మరియు సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరగగా, తొలి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో ఈ గొడవ జరిగింది. మొదటి బంతి బ్యాటర్ ఓవర్ హెడ్(తల) మీదుగా వెళ్లడంతో అంపైర్ ఫస్ట్ బౌన్సర్ ఇచ్చాడు. అనంతరం రెండో బంతి కూడా అలానే దూసుకెళ్లింది. అయితే, ఈ బంతి బ్యాటర్ హెల్మెట్‌ను బలంగా తాకింది.
A wide not given by the umpires makes Shakib Al Hasan furious. pic.twitter.com/KPgVWmYtrg
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2023
వెంటనే బ్యాటర్ పక్కకువెళ్లిపోవడం.. మైదానమంతా ఒక్కసారిగా మూగపోవడం.. ఫిజియో పరుగెత్తుకరావడం చకచకా జరిగిపోయాయి. అనంతరం ఫిజియో అతన్ని పరిశీలించాక.. ఓకే అన్నాక మ్యాచ్ కొనసాగించారు. ఈ తతంగమంతా దాదాపు 5 నిమిషాల పాటు జరిగింది. ఇది ముగిశాక రెండో బంతిని.. నో బాల్ అన్నట్లుగా అంపైర్లు సిగ్నల్ ఇచ్చారు. ఇదే ప్రత్యర్థి ఆటగాళ్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇదేమీ నిర్ణయమంటూ రంగ్‌పూర్ రైడర్స్ సారధి నురుల్ హసన్, పాక్ బౌలర్ హ్యారిస్ రౌఫ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. అనంతరం కాసేపటి తరువాత మ్యాచ్ యధాతధంగా కొనసాగింది. కాగా, ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ నిర్ణీత 20 ఓవర్లలో 92 పరుగులు చేయగా, రైడర్స్ 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
Haris Rauf In fight With Umpire over a no Ball. #BPL #Bpl2023 pic.twitter.com/oLLme81d7f
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) January 27, 2023