బాక్సర్ నిఖత్ జరీన్.. ఆమె పంచ్ దెబ్బకు పతకాలు వరుస కడతాయి. ఈ ఏడాది మేలో ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల వరల్డ్ చాంపియన్ షిప్స్ విజేతగా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది. సామాన్య సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన నిఖత్.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. బాక్సింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఘే రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించినా సరే.. వారందరికి సినిమా తారాలంటే అభిమానం ఉంటుంది. సామాన్యుల మాదిరే వారిని కలవాలని.. వారితో ఫోటో దిగాలని భావిస్తారు. సామాన్యులకయితే.. ఆ అవకాశం లభించడం కష్టం. కానీ సెలబ్రిటీలకు ఆ అవకాశం వెంటనే లభిస్తుంది. తాజాగా నిఖత్ జరీన్ కూడా తన అభిమాన హీరోని కలిసింది. అంతేకాక.. అతడితో డ్యాన్స్ కూడా చేసింది. ఇందుకు సంబంధింఇచన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరలవుతోంది.
నిఖత్ జరీన్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ని కలిసింది. అభిమాన హీరోను కలిసి.. ఫ్యాన్ మూమెంట్‌ని తీర్చుకున్న నిఖత్.. ఎట్టకేలకు తన కల నెరవేరింది అంటూ పోస్ట్ చేసింది. అంతేకాక సల్మాన్ ఐకానిక్ సాంగ్ సాథియా తూనే క్యా కియాను రీక్రియేట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చసింది. దీనిలో సల్మాన్ కూడా నిఖత్‌తో కలిసి చిన్న మూమెంట్స్ ఇచ్చాడు. ఇంతేజార్ ఖతం హుహా అంటూ ట్విట్టర్లో వీడియోని పోస్ట్ చేసింది నిఖత్. గతంలో వరల్డ్ ఛాంపియన్షిప్స్ టైటిల్ గెలిచిన వేళ సల్మాన్.. నిఖత్‌ను ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశాడు.
సాథియా తూనే క్యా కియా పాట.. ఇప్పటికి కూడా ప్రేక్షకుల చెవుల్లో మారు మోగుతుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణం పాడిన ఈ పాట.. ఇప్పటికి ఎంతో మంది ఫేవరెట్ సాంగ్స్ లిస్ట్‌లో ఉంటుంది. ఇక సురేష్ కృష్ణ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, రేవతి జంటగా వచ్చిన లవ్ చిత్ర మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తెలుగులో వచ్చిన ప్రేమ చిత్రానికి ఇంది హిందీ రీమేక్. ఇక తెలుగులో ప్రేమ చిత్రంలో వెంకటేష్, రేవతి జంటా నటించారు. టాలీవుడ్లో కూడా ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
Finallyyyyy intezar khatam hua❤️@BeingSalmanKhan #fanmoment#dreamcometrue#salmankhan pic.twitter.com/pMTLDqoOno
— Nikhat Zareen (@nikhat_zareen) November 8, 2022