న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా-2021 మరికొన్ని గంట్లలో ప్రారంభం కానుంది. టూర్ లో భాగంగా తొలుత 3 టీ-20ల సిరీస్ లో భారత్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. టీ20 సిరీస్ కు ముందు న్యూజిలాండ్ కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్ కు కేన్ మామ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో సౌథీ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి టెస్టు సిరీస్ తో జట్టుతో కలుస్తాడని ప్రకటించారు.
Kane Williamson will miss this week’s three-game T20 series against India as he prioritises preparing for the Test series starting on November 25 in Kanpur. #INDvNZ https://t.co/zff00W47ER
— BLACKCAPS (@BLACKCAPS) November 16, 2021
ఐపీఎల్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్, వెంటనే ఇండియా టూర్ ఉండటంతో కేన్ విలియమ్సన్ కాస్త విశ్రాంతి కోరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చాలా కాలంగా కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అందుకే కాస్త విశ్రాంతి కావాలని కోరుకున్నాడు. న్యూజిలాండ్ ను డబ్ల్యూటీసీ ఛాంపియన్ గా నిలిపిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా రెండు టెస్టులు ఉండటంతో వాటిపై దృష్టి పెట్టాడు. నవంబరు 25 నుంచి ప్రారంభం కానున్న టెస్టుల్లో కేన్ విలియమ్సన్ పాల్గొంటాడని స్పష్టం చేశారు. ఇప్పటికే న్యూజిలాండ్ టీమ్ జైపూర్ చేరుకుని ప్రాక్టీస్ చేస్తోంది. టీ20 సిరీస్, మొదటి టెస్టుకు రోహిత్ శర్మ కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ పూర్తిస్థాయి కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. మొదటి టెస్టుకు అజింక్య రహానే కెప్టెన్ గా ఉండనున్నాడు. రెండో టెస్టు నుంచి కోహ్లీ తిరిగి జట్టుతో కలుస్తాడు.
టాడ్ ఆస్ల్టే, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, లోకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, కైలీ జెమీషన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ(కెప్టెన్).
Here to make your day with a few photos of Kane Williamson doing what he does best 🤩
📝 https://t.co/ejaVX07a0O | #T20WorldCup pic.twitter.com/j9yDDYcNxk
— ESPNcricinfo (@ESPNcricinfo) November 14, 2021
Kane Williamson makes everyone smile 🤗 #T20WorldCup pic.twitter.com/EXb54e8M89
— ESPNcricinfo (@ESPNcricinfo) November 12, 2021