టీ20 వరల్డ్ కప్ 2022.. అందరి చూపు టీమిండియా మీదే. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ జట్లలో భారత్ కూడా ఒకటి. అయితే టీమిండియాను మాత్రం గాయాలు తెగ ఇబ్బంది పెడుతున్నాయి. జట్టులో స్టార్ బౌలర్లు అయిన బూమ్రా, దీపక్ చాహర్, స్పిన్నర్ రవీంద్ర జడేజాలు టీ20 ప్రపంచ కప్ కు గాయాల కారణంగా దూరం అయ్యారు. దాంతో బౌలింగ్ భారం అంతా ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ పైనే ఉంది. “ఆస్ట్రేలియా గడ్డపై భువనేశ్వర్ ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. ప్రస్తుతం అతడి స్వింగ్, పేస్ బాగాలేదు” పాక్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రం భువీ బౌలింగ్ పై అన్న మాటలు ఇవి. పొరపాటున ఈ మాటలను భువీ విన్నాడో ఏమో గానీ.. టీమ్ ఆటగాళ్లందరూ గ్రౌండ్ నుంచి వెళ్లి పోయినా గాని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం భువీ ఒక్కడే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
భువనేశ్వర్ కుమార్.. సమకాలీన క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడుగా భువీ పేరుగాంచాడు. అయితే గత కొన్ని రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూ.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడిపై ఇంటా బయట సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజుల ముందు ఆసియా కప్ లో పాక్ పై ఆ తర్వాత శ్రీలంక పై 19వ ఓవర్ లో భారీగా పరుగులు ఇవ్వడంతో ఆ రెండు మ్యాచ్ ల్లో టీమిండియా ఓటమి పాలయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రెండు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ భారం అంతా భువనేశ్వర్ కుమార్ పైనే ఉంది. కీలక ఆటగాళ్లు అందరు గాయాల కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో జట్టు బౌలింగ్ దళం బలహీనంగా మారిందంటూ.. విమర్శలు వస్తున్న నేపథ్యంలో భువీ కఠోర సాధన చేస్తున్నాడు. మైదానంలో జట్టులోని మిగతా ఆటగాళ్లు ఎవరూ లేకున్నాగానీ.. ఒక్కడే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. నిజమైన ఆటగాడిగా నిరూపించుకున్నాడు.
ఇక 23 న టీమిండియా తన తొలి మ్యాచ్ ను పాక్ తో ఆడబోతుంది. ఈ క్రమంలోనే యార్కర్లను ప్రాక్టీస్ చేస్తున్నాడు భువీ. జట్టులో ఉన్న మిగతా బౌలర్లలో సిరాజ్, శార్దుల్, అర్షదీప్ లకు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం తక్కువ. దాంతో భువీనే వారిని కో-ఆర్డినేట్ చేసుకుంటూ.. ప్రపంచ కప్ లో ముందుకు పోవాలి. అందులో భాగంగానే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఉండలనే.. భువీ ఎక్కువ సమయం గ్రౌండ్ లోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. “భువీ తన అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాడు.. ఇక పాక్ కు చుక్కలే” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
All the other players left, Bhuvneshwar Kumar still practising 🇮🇳@YaariSports #SportsYaari pic.twitter.com/mXNtdpmHGG
— Sushant Mehta (@SushantNMehta) October 13, 2022