క్రికెట్ చూడటానికి ఎంత సరదాగా ఉంటుందో.. ఆడుతుంటే కూడా అంతే సరదాగా ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే ఏకంగా ప్రాణాలే పోతుంటాయి. గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం. ఎంత జాగ్రత్త పడినా సరే కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి. గతంలోనూ ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూజ్ మెడపై బంతి బలంగా తాకడంతో మైదానంలో అతడు కుప్పకూలాడు. ఆ తర్వాత కాసేపటికే మరణించాడు. అప్పటి నుంచి క్రికెటర్లు.. ఆడే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 ప్రపంచకప్ ముందు ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. పెర్త్ వేదికగా ఆదివారం తొలి టీ20 జరిగింది. ఇందులో భాగంగా ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో డేనియల్ శామ్స్.. ఫస్ట్ బంతిని స్లో డెలివరీ వేశారు. మిడాన్ షాట్ కొట్టిన స్టోక్స్, రెండు పరుగులు తీశాడు. ఇక తర్వాత బంతి కూడా స్లో డెలివరీనే స్టోక్స్ అనుకున్నాడు. రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. కాకపోతే ఈసారి శామ్స్.. గుడ్ లెంగ్త్ బంతి వేగంగా వచ్చింది. కాస్త లోపలికి టర్న్ అయింది. దీంతో స్టోక్స్ కి బాల్ కనెక్ట్ అవలేదు. బదులుగా హెల్మెట్ దిగువ భాగంలో బంతి బలంగా తగిలింది.
దీంతో అప్పటికే రాబోయే ప్రమాదాన్ని ఊహించిన స్టోక్స్.. తప్పించుకునేందుకు ట్రై చేశాడు. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో బంతి తగిలిన వేగానికి గాల్లో ఎగిరి కిందపడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఇంగ్లాండ్ టీమ్ షాకైంది. వెంటనే ఫిజియో వచ్చి స్టోక్స్ కి తగిలిన గాయాన్ని పరిశీలించాడు. అలానే బ్యాటింగ్ కొనసాగించిన ఇతడు.. 9 పరుగులతోనే ఔటై పెవిలియన్ బాటపట్టాడు. రివర్స్ స్వీప్ కి సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. సరిగ్గా టీ20 ప్రపంచకప్ ఇలా జరగడం, జస్ట్ మిస్ కావడంతో ఇంగ్లీష్ జట్టు ఊపిరి పీల్చుకుంది. స్టోక్స్ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Ouch!
Stokes has been checked out and is ok to continue #AUSvENG pic.twitter.com/NaupZOZEhO
— cricket.com.au (@cricketcomau) October 9, 2022