ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దక్షిణాఫ్రికాతో చెస్టర్-లీ-స్ట్రీట్ గేమ్‌లో ఆడే వన్డే తనకు చివరి మ్యాచ్ అని స్టోక్స్ ప్రకటించాడు. ఈ సందర్భంగా స్టోక్స్ మాట్లాడుతూ.. “మంగళవారం డర్హామ్‌లో జరిగే వన్డే నా చివరి మ్యాచ్. వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. దేశం కోసం సహచరులతో కలిసి ఆడిన ప్రతి క్షణాన్ని ఆశ్వాదించాను.’ అంటూ స్టోక్స్ పేర్కొన్నాడు. వన్డే క్రికెట్ నుంచి తప్పుకుని.. టెస్టు, టీ20 క్రికెట్‌కు వందశాతం న్యాయం చేస్తానని స్టోక్స్ వెల్లడించాడు.
బెన్‌స్టోక్స్ ఇప్పటి వరకు 104 వన్డేలు ఆడాడు. 89 ఇన్నింగ్స్‌ల్లో 36.16 సగటుతో 5280 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలో, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 74 వికెట్లు కూడా తీసుకున్నాడు. 5 వికెట్ల ఫీట్ ఒక సారి సాధించాడు. భారత్‌తో మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాతి రోజే స్టోక్స్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా.. 2019లో ఇంగ్లండ్ వన్డే వరల్డ్ కప్ గెలవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. మరి బెన్‌స్టోక్స్ వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
❤️🏴 pic.twitter.com/xTS5oNfN2j
— Ben Stokes (@benstokes38) July 18, 2022