SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ben Stokes Created History With 100 Sixes And 100 Wickets In Test Cricket

Ben Stokes: టెస్టు క్రికెట్‌ చరిత్రలో కనీవిని ఎరుగని రికార్డు సాధించిన బెన్‌స్టోక్స్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 25 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ben Stokes: టెస్టు క్రికెట్‌ చరిత్రలో కనీవిని ఎరుగని రికార్డు సాధించిన బెన్‌స్టోక్స్‌!

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డు సాధించాడు. ఇంత వరకు టెస్టు ఫార్మాట్‌లో కనీవిని ఎరుగని రికార్డును నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టి, 100 వికెట్లు తీసిన తొలి టెస్టు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో స్టార్ ఆల్-రౌండర్ ఈ మైలురాయిని అందుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో స్టోక్స్ 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఈ 18 పరుగుల్లోనే అతను సిక్స్ కొట్టడంతో టెస్ట్ క్రికెట్లో సిక్సర్ల సెంచరీని అందుకున్నాడు. ఇక 81 టెస్టుల్లో.. స్టోక్స్ ఇప్పటికే 32.67 సగటుతో, 3.29 ఎకానమీ రేటుతో 177 వికెట్లు తీశాడు. కాగా టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు కొట్టిన మూడో ఆటగాడిగా కూడా స్టోక్స్‌ రికార్డుల్లోకెక్కాడు. 96 టెస్టులు ఆడిన బెన్‌ స్టోక్స్‌ ఈ ఫార్మాట్‌లో 100 సిక్సర్లు కొట్టిన మూడో బ్యాటర్‌ అయ్యాడు.

స్టోక్స్‌ కంటే ముందు ఇంగ్లండ్‌ ప్రస్తుత హెడ్‌ కోచ్‌, కివీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌, ఆస్ట్రేలియన్‌ మాజీ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టారు. మెకల్లమ్‌ తన కెరీర్‌లో మొత్తం 107 సిక్సులు కొట్టగా, గిల్‌క్రిస్ట్‌ 100 సిక్సర్లు కొట్టారు. కానీ.. వీరికి ఈ వంద సిక్సులతో పాటు వికెట్లు లేవు.. కానీ స్టోక్స్‌కు 100 సిక్సర్లతో పాటు 100 వికెట్లు కూడా కూడా ఉండడంతో అతను ఎంతటి నిఖార్సయిన ఆల్‌రౌండర్‌ అన్న విషయం తెలియజేస్తుంది. కాగా ఈ వంద సిక్సర్ల క్లబ్‌లో టాప్‌ 5లో ఒక్క ఇండియన్‌ క్రికెటర్‌ కూడా లేకపోవడం గమనార్హం. ఒక్క వీరేంద్ర సెహ్వాగ్‌ మాత్రమే 104 ఇన్నింగ్స్‌లలో 91 సిక్సులతో 6వ స్థానంలో ఉన్నాడు. మెకల్లమ్‌(107), గిల్‌క్రిస్ట్‌(100) తర్వాత ఈ క్లబ్‌లో చేరాడు స్టోక్స్‌ అతని తర్వాత అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో కరేబీయన్‌ వీరుడు క్రిస్‌గేల్‌ 98 సిక్సులు, ఐదో స్థానంలో సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ 97 సిక్సులతో ఉన్నారు.

Ben stokes test cricket records

ఇక ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే టైంకి ఇంగ్లాండ్ న్యూజిలాండ్ కంటే 65పరుగుల వెనుకంజలో ఉంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 329పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత.. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏ వ్యూహంతో ఆడారో అర్థం కాలేదు. హిట్టింగ్ ఎటాకింగ్ వ్యూహంతో ఆడాలని వారు ప్రయత్నించినట్లు స్పష్టమయింది. అయితే పేసర్ ట్రెంట్ బౌల్ట్ మొదటి ఏడు ఓవర్లలోనే అలెక్స్ లీస్ (4), జాక్ క్రాలే (6), ఆలీ పోప్ (5)లను క్లీన్ బోల్డ్‌లుగా ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 17పరుగులకే 3వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్ జో రూట్ (5) కూడా పెద్దగా రాణించలేకపోయాడు. స్టోక్స్ (18), బెన్ ఫోక్స్ (0) డకౌట్ కావడంతో ఇంగ్లాండ్ 55పరుగులకే 6వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అయితే క్రీజులో ఎటాకింగ్ వ్యూహంతో సక్సెస్ అయిన జానీ బెయిర్‌స్టో మాత్రం న్యూజిలాండ్ బౌలర్లను ఆడుకున్నాడు. అతనికి తోడు అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న జానీ ఓవర్టన్ సైతం క్రీజులో కుదురుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ మళ్లీ ఇన్నింగ్స్‌పై పట్టు సాధించింది. బెయిర్‌స్టో రెండో టెస్ట్‌లో చెలరేగినట్లే మూడో టెస్ట్‌లోనూ చెలరేగి ఆడుతున్నాడు. ఈ క్రమంలో సెంచరీ సాధించిన బెయిర్ స్టో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ఇంగ్లాండ్‌ను గట్టెక్కించాడు. ఇక టెస్టుల్లో తన పదో సెంచరీని బెయిర్ స్టో నమోదుచేశాడు. అలాగే టెస్ట్‌లలో 5,000పరుగుల మైలురాయిని కూడా పూర్తి చేశాడు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి 264/6తో నిలిచిన ఇంగ్లాండ్.. బెయిర్ స్టోతో పాటు మరో పక్క జేమీ ఓవర్టన్ (97పరుగులు 136బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు) అనూహ్యంగా రాణించడంతో మూడో రోజు కూడా స్కోరు బోర్డు సజావుగా సాగింది. సెంచరీకి మూడు పరుగుల దూరంలో బౌల్ట్ బౌలింగ్లో ఓవర్టన్ క్యాచ్ ఔటయ్యాడు. ఇక ఒకానొక దశలో ఇంగ్లాండ్ మ్యాచ్‌లో కివీస్ కంటే చాలా వెనుకబడినప్పటికీ.. ఇంగ్లాండ్ ప్రస్తుతం న్యూజిలాండ్ కంటే ముందంజ వేసింది. 62ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ 7వికెట్లు కోల్పోయి 331పరుగులు చేసింది. తద్వారా 2పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక క్రీజులో జానీ బెయిర్ స్టో (161పరుగులు 152బంతుల్లో 24బంతుల్లో), స్టువర్ట్ బ్రాడ్ (27పరుగులు 21బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) ఆడుతున్నారు. వారి రెండవ రోజును మెరుగైన స్థితిలో ముగించడంలో సహాయపడింది. ఇంగ్లాండ్ బౌలర్టలో ట్రెంట్ బౌల్ట్ 4, నీల్ వాగ్నర్ 2, సౌతీ 1 వికెట్ తీసుకున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 329 పరుగులు చేయడానికి కారణం.. ఫామ్‌లో ఉన్న డారిల్ మిచెల్ (109), టామ్ బ్లండెల్ (55) రాణించడమే. వారిద్దరు మరోసారి తమ సత్తా చాటడంతో కివీస్‌ ఓ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇకపోతే జాక్ లీచ్ తన స్పిన్ బౌలింగ్‌తో 5/100తో ఇంగ్లాండ్‌కు మంచి బ్రేక్స్ ఇచ్చాడు. స్టువర్ట్ బ్రాడ్ కూడా 3/62 ప్రదర్శనతో సత్తాచాటాడు. మరి 100 వికెట్లు, 100 సిక్సులతో బెన్‌స్టోక్స్‌ సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • Ben Stokes
  • Cricket News
  • England
  • Test cricket
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

    Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam