టీమిండియా కొత్త సారథిగా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ తానేంటో నిరూపిస్తున్నాడు. వరుస విజయాలతో రోహిత్ నాయకత్వంలో భారత జట్టు దుమ్మురేపుతోంది. ఈ నెల ఆరంభంలో వెస్టండీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను 3-0 తో, టీ20 సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసి భారత జట్టు మంచి ఊపుమీదొంది. ఇక ఈ నెల 24 నుంచి పొరుగుదేశం లంకతో జరుగుతున్న టీ20 సిరీస్ 3-0 తో క్లీన్ స్వీప్ చేసి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అయితే.. ప్రస్తుత సిరీస్‌లో రోహిత్ శర్మ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఇదే విషయమై.. టీమిండియా మాజీ ఆటగాడు.. ప్రస్తుత కామెంటేటర్ మహ్మద్ కైఫ్.. కెప్టెన్ రోహిత్ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత జట్టు.. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది(2022) జరగనున్న టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ప్లేయింగ్ ఎలెవన్ లో మార్పులు చేస్తోంది. అందులో భాగంగానే.. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ ను వన్ డౌన్ లో పంపడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో.. రోహిత్ ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారా అని ఆలోచన ఉండేది. ఏ జట్టులోనైనా మూడవ స్థానం చాలా కీలకం. ఈ స్థానం జట్టు విజయంపై చాలా ప్రభావం చూవుతుంది. ప్రస్తుత సిరీస్‌లో 3 వ స్థానంలో బ్యాట్టింగ్ చేస్తోన్న శ్రేయాస్ అయ్యర్ 3 ఇన్నింగ్సల్లోనూ 57, 74, 73 ఇలా వరుస అర్ధ సెంచరీలతో అద్భుతంగా రాణించాడు. ఈ సమయంలో రోహిత్ తీసుకున్న నిర్ణయంపై టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్.. “రోహిత్ పట్టిందల్లా బంగారమే అవుతోందంటూ కొనియాడాడు. తన అద్భుతమైన కెప్టెన్సీతో జట్టుకు విజయాలు అందిస్తున్నాడని కితాబిచ్చాడు”.
Man of the Match ✅
Man of the Series ✅How good was @ShreyasIyer15 in this series 👏👏@Paytm #INDvSL pic.twitter.com/654OhvNlTa
— BCCI (@BCCI) February 27, 2022
ఈ మేరకు.. “రోహిత్ శర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చేటపుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అతడు పట్టిందల్లా బంగారమే అవుతోంది. శ్రేయాస్ అయ్యర్ ను మూడో స్థానంలో పంపడం, ఆటగాళ్లను రొటేట్ చేయడం, బౌలింగ్ విభాగంలో మార్పులు.. ఇలా అతడు తీసుకున్న ప్రతి నిర్ణయం వ్యూహాత్మకమే ” అంటూ కైఫ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిసిపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో.. ముంబై ఇండియన్స్ అభిమానులు మరోసారి కప్పు మాదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ 5 సార్లు (2013,15,17,19,20) ట్రోఫీని కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Be careful to shake hands with Rohit Sharma these days. Anything he touches turns to gold. Shreyas at No.3, rotation of players, bowling changed. Every move, a master stroke. #Goldentouch @ImRo45
— Mohammad Kaif (@MohammadKaif) February 27, 2022
From mantra of success to a guest apperance! 😎😎
Chahal TV Special: @ShreyasIyer15, with @mdsirajofficial for company, chats with @yuzi_chahal after #TeamIndia‘s T20I series sweep. 👌 👌 – By @Moulinparikh
Full interview 🎥 🔽 #INDvSL @Paytm https://t.co/FOL75d7bIs pic.twitter.com/4Awzp9BvIK
— BCCI (@BCCI) February 28, 2022
CHAMPIONS #TeamIndia 🎉@Paytm #INDvSL pic.twitter.com/Zkmho1SJVG
— BCCI (@BCCI) February 27, 2022