క్రికెట్ అభిమానులకు బీసీసీఐ సెక్రటరీ జైషా గుడ్‌న్యూస్ చెప్పాడు. దాదాపు రెండున్నర నెలల పాటు క్రికెట్ ప్రేమికులకు వినోదం పంచే ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంచనున్నట్లు జైషా తెలిపారు. ఐసీసీ అనుమతి పొందేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పాడు. ఈ మేరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్లానింగ్ జాబితాలో ఈ ప్రతిపాదనను చేరుస్తామని జైషా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా స్టార్ ఆటగాళ్లు పాల్గొనే లీగ్‌ను మరో రెండు వారాలు అదనంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా మరిన్ని కొత్త ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఇప్పుడైతే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రకారం పది జట్లతోనే లీగ్ నిర్వహిస్తామన్నాడు. వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఐపీఎల్ విండోపై పూర్తి క్లారిటీ వస్తుందని పేర్కొన్నాడు. అలాగే ఐపీఎల్ జరిగే సమయంలో ఇతర దేశాల సిరీస్‌లు లేకుండా.. అన్ని దేశాల ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొందుకు అవకాశం కల్పించాలని, అందుకోసం ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని ఐసీసీతో పాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఇప్పటి వరకు ఐపీఎల్ రెండు నెలలపాటు 74 మ్యాచ్‌లను నిర్వహించేవారు. ఇక రెండున్నర నెలలపాటు నిర్వహిస్తే మాత్రం మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి భారీ మొత్తంలో ఆదాయం వచ్చింది. అలాగే 2024-2031 భవిష్యత్ పర్యటనల కార్యాచరణను నిర్దేశించడానికి ఐసీసీ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చే నెలలో సమావేశం కానుంది. ఈ క్రమంలో అనుబంధ దేశాలతోపాటు టాప్ జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడేలా సమగ్రమైన క్యాలెండర్‌ను రూపొందించడమే తమ లక్ష్యమని జైషా స్పష్టం చేశారు. మరి ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య, సమయంపై పెరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 NEWS 🚨: BCCI announces the successful bidders for acquiring the Media Rights for the Indian Premier League Seasons 2023-2027. #TATAIPL
More Details 🔽 https://t.co/pX9PHQQ1UK
— IndianPremierLeague (@IPL) June 15, 2022