ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది.
ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనతో జట్టును ముందుకు నడిపిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. గాయం కారణంగా ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్ 2-2తో సమం కాగా.. కంగారూ జట్టు కప్పు నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన ఐదో టెస్టు సమయంలోనే కమిన్స్ చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు దాదాపు రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ దూరమయ్యే చాన్స్ ఉన్నట్లు సమాచారం. చేతి వేల్ల మధ్య చీలక వచ్చినట్లు వైద్య బృందం గుర్తించింది. దీంతో త్వరలో జరుగనున్న దక్షిణాఫ్రికా, భారత్ పర్యటనలకు అతడు దూరమయ్యే చాన్స్‌లు ఉన్నాయి.
మరి సరిగ్గా రెండు నెలల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. అప్పటి వరకు కమిన్స్ కోలుకుంటాడా అనేది తేలాల్సి ఉంది. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 8న టీమిండియాతో తలపడనుంది. ప్రస్తుతం కమిన్స్ టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. రెండు నెలల్లో కమిన్స్ కోలుకోకపోతే.. కంగారూ జట్టు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత 5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ ఆడింది. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ ఆడిన కమిన్స్ యాషెస్ సందర్భంగానే గాయపడినట్లు తెలుస్తోంది.
త్వరలో ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా 3 టీ20లు, 5 వన్డేలు ఆడనుంది. ఈ టూర్ ముగిసిన అనంతరం వన్డే ప్రపంచకప్ కోసం కంగారూలు నేరుగా భారత్‌లో అడుగు పెట్టనున్నారు. మెగాటోర్నీకి ముందు భారత్, ఆసీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. మరి ఆ లోపు కమిన్స్ కోలుకుంటాడా అనేది తేలాల్సి ఉంది. సఫారీ టూర్‌కు కమిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టుకు నాయకత్వం వహించే చాన్స్‌లు ఉన్నాయి. ఒకవేళ భారత్ పర్యటనతో పాటు వన్డే ప్రపంచకప్‌నకు కూడా కమిన్స్ దూరమైతే.. ఎలా అని సెలెక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ‘లైక్ టు లైక్ రిప్లేస్‌మెంట్’ కింద షాన్ మార్ష్‌ను కమిన్స్ స్థానంలో ఆడించాలని యోచిస్తున్నారు.
Pat Cummins could miss the 3 match ODI series against India next month due to a wrist injury. pic.twitter.com/n1ApOg2rPg
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 5, 2023