ఆస్ట్రేలియా యువ వికెట్ కీపర్ ఆలెక్స్ కారీ ఏమరుపాటుగా నడుస్తు స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. కారీకి ఈత రావడం, స్విమ్మింగ్ పూల్ అంతలోతుగా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు శిబిరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కరాచీలోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆలెక్స్ కారీ అనుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు.
కారీ తన సహచరులతో మాట్లాడుకుంటూ వస్తూ.. స్విమ్మింగ్ పూల్‌ను గమనించకుండా దాంట్లో పడిపోయాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న ఆటగాళ్లందరూ ఒక్కసారిగి నవ్వుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ రికార్డు చేశాడు. అంతేకాకుండా తన ఇనస్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను కమ్మిన్స్ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అచ్చం ఒకేలా సచిన్, స్మిత్ గణాంకాలు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.