సాధారణంగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాక ఆటగాళ్లు తమకు ఇష్టమైన రంగాల్లో స్థిరపడుతుంటారు. అలాగే స్థిరపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ క్రమంలోనే బీబీసీకి చెందిన ప్రముఖ షో అయిన ‘టాప్ గేర్’ లో నటిస్తున్నాడు. అయితే తాజాగా జరిగిన షూటింగ్ లో ఫ్లింటాఫ్ కారు యాక్సిడెంట్ కు గురైంది. దాంతో అతడికి వెంటనే చికిత్సను అందించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఫ్లింటాఫ్ ను ఆస్పత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రముఖ సంస్థ అయిన BBC నిర్వహిస్తున్న షో ‘టాప్ గేర్’. ఈ షోకు సంబంధించిన ఓ ఎపిసోడ్ ను సోమవారం చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రీకరణలో పాల్గొన్న ఫ్లింటాఫ్ కు కార్ యాక్సిడెంట్ అయ్యింది. టెస్టు ట్రాక్ లో భాగంగా మంచు కారణంగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఫ్లింటాఫ్ కారు ప్రమాదానికి గురైంది. వెంటనే అక్కడే ఉన్న మెడికల్ సిబ్బంది అతడికి ప్రథమ చికిత్సను అందించారు. అనంతరం ఎయిర్ అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి అయితే ఫ్లింటాఫ్ కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో ఫ్లింటాఫ్ తక్కువ వేగంతోనే ఉన్నట్లు అక్కడి వారు తెలిపారు. అయితే ఫ్లింటాఫ్ టాప్ గేర్ షూటింగ్ లో గాయపడటం ఇదే మెుదటి సారికాదు. 2019లో కూడా అతడు టాప్ గేర్ ఎపిసోడ్ షూటింగ్ లో ప్రమాదం బారిన పడ్డాడు. అప్పుడు సైతం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇక ఫ్లింటాఫ్ గాయపడటంతో షూటింగ్ ను వాయిద వేసినట్లు మేకర్స్ తెలిపారు.
*Andrew Flintoff 🏴 has been taken to hospital after being involved in an accident!*#Cricket #England pic.twitter.com/zfTapCm5ej
— Roshan Abeysinghe (@RoshanCricket) December 14, 2022
Former England all-rounder Andrew Flintoff has been taken to hospital after being involved in an accident while working on Top Gear. pic.twitter.com/TZyph0PUyl
— Sky Sports News (@SkySportsNews) December 13, 2022