ఒకే ఓవర్ లో 18 పరుగులు ఇస్తేనే ఓ రేంజ్ లో ఆడుకుంటారు. అలాంటిది ఒకే బంతిలో 18 పరుగులు ఇస్తే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. ఒకే బంతిలో 18 పరుగులు ఇచ్చి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు బౌలర్.
12 బంతుల్లో 50 కొట్టిన యువరాజ్ సింగ్ ని చూశాం, వెస్ట్ ఇండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ ని చూశాం, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ హజరాతుల్లాహ్ జజాయీని చూశాం. అంటే బంతికి 4 పరుగుల చొప్పున కొట్టినట్టు. ఈ ముగ్గురికీ ఆయా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆరోజు బౌలర్ల దరిద్రం బాలేదో, ఆ బ్యాట్స్ మెన్ అదృష్టం బాగుందో తెలియదు కానీ మొత్తానికి ముగ్గురు బ్యాట్స్ మెన్ ఖాతాల్లో వరల్డ్ రికార్డులు వచ్చి పడగా.. వీరికి బౌలింగ్ వేసినందుకు బౌలర్ల ఖాతాల్లో చెత్త రికార్డులు నమోదయ్యాయి. అయితే వీరిని మించిపోయిన బౌలర్ మరొకరు ఉన్నారు. ఆ బౌలర్లు బంతికి యావరేజ్ గా 4 పరుగుల చొప్పున సమర్పించుకుంటే.. ఈ బౌలర్ మాత్రం ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు.
ఒక్క బాల్ కి 18 పరుగులా? టూ మచ్ రా రేయ్ అని అనాలనిపిస్తుంది కదూ. మరి ఆ టూ మచ్ డైలాగ్ కి మ్యాచ్ అయిన క్రికెటర్ మరెవరో కాదు.. అభిషేక్ తన్వర్. మంగళవారం రాత్రి తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా సలేమ్ స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గల్లీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ అత్యంత చెత్త రికార్డు నమోదయ్యింది. సలేమ్ స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ చెపాక్ సూపర్ గల్లీస్ ఇన్నింగ్స్ లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేశాడు. క్రీజులో సంజయ్ యాదవ్ ఉన్నాడు. ఓవర్ లో మొదటి 4 బంతులు వేసిన అభిషేక్ 6 పరుగులు ఇచ్చుకున్నాడు. తర్వాత నోబాల్ వేసి ఒక పరుగు ఇచ్చుకున్నాడు. దీంతో 5 బంతులకు 8 పరుగులు వచ్చాయి. ఇక ఆఖరి బంతి వేయడానికి చాలా కష్టాలు పడ్డాడు. మూడు నోబాల్స్, ఒక వైడ్ బాల్ వేసి అప్పుడు కరెక్ట్ గా బాల్ వేసి ఓవర్ ముగించాడు.
మొదటి నోబాల్ కి ఒక పరుగు లభించగా, రెండో నోబాల్ కి 6 పరుగులు, నోబాల్ పరుగు 1 లభించాయి. మూడవ నోబాల్ కి 2 పరుగులు, ఒక నోబాల్ పరుగు లభించాయి. నాల్గవ బంతి వైడ్ బాల్ కి ఒక పరుగు వచ్చింది. ఆ తర్వాత కరెక్ట్ గా వేసిన ఆఖరి బంతికి 6 పరుగులు వచ్చాయి. ఇలా మొత్తంగా ఒక బంతికి 18 పరుగులు ఇచ్చాడు అభిషేక్ తన్వర్. ఒక ఓవర్ లో 26 పరుగులు ఇచ్చాడు. ఇలా ఒకే బంతికి, అది కూడా ఆఖరి బంతికి 18 పరుగులు ఇచ్చి టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన బౌలర్ గా అభిషేక్ తన్వర్ పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే చెపాక్ సూపర్ గల్లీస్ 52 పరుగుల తేడాతో సలేమ్ స్పార్టాన్స్ మీద 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరి ఒకే బంతికి 18 పరుగులు ఇచ్చిన అభిషేక్ తన్వర్ పై మీ అభిప్రాయమేమిటి? ఇలా ఒకే బంతిలో భారీ పరుగులు ఇచ్చిన బౌలర్ ఉంటే కామెంట్ చేయండి.
The most expensive final delivery in history – 18 runs from the last ball of the 20th over. pic.twitter.com/rf8b0wMhOw
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 13, 2023